సౌదీ మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌

Update: 2019-08-21 12:16 GMT
ప్రపంచ దేశాలన్నింటిలోనూ మహిళలపై తీవ్రమైన ఆంక్షలు, అత్యంత వివక్ష ఉన్న ముస్లిం దేశాలలో ఇటీవల సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సౌదీఅరేబియాలో మహిళలపై కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన విపక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు వీలు ఉండదు... ప్రతి మహిళ ఆదేశ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బురఖా ధరించాలి. ఈ క్రమంలోనే ఆధునిక వస్త్రాలు ధరించేందుకు అక్కడ మహిళలకు అనుమతి లేదు. ఓ వైపు ప్రపంచం ఎన్నో విధాలుగా కొత్త పుంతలు తొక్కుతున్నా... సౌదీ మహిళలు మాత్రం ఓ చట్రంలో బందీ అయిపోయారు.

అయితే ఇటీవల కాలంలో మహిళలపై వివక్ష తగ్గుతూ వస్తోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం గానే భావించాలి. లేటెస్ట్ గా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ సౌదీ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు తీసుకు వచ్చింది. అక్క‌డ మ‌హిళ‌ల‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు తీసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు.

ఈ మార్పును ఆ దేశ ప్ర‌జ‌ల‌తో పాటు మ‌హిళ‌లు స్వాగ‌తిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ఆధునిక వాదుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌గా... మ‌త చాంద‌స‌వాదులు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్దమంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా నేటి నుంచి ఈ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు విభాగం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

వాస్త‌వంగా అయితే సౌదీలో మ‌హిళ‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు గార్డియ‌న్ షిప్ చ‌ట్టం అమ‌ల్లో ఉంది. ఈ చ‌ట్టం ప్ర‌కారం సౌదీ మహిళలు ఒంటరిగా ఎక్కడి వెళ్లకూడదు. స్కూల్ కానీ, కాలేజ్ కాని, మరే ఇతర ప్రాంతాలైన వారితో పాటు తండ్రి కాని, సోద‌రుడు కాని ఎవ‌రో ఒక‌రిని వెంట పెట్టుకునే వెళ్లాలి. అయితే ప్ర‌గ‌తి కోసం సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు. కొంద‌రు ధ‌న‌వంతులైన సౌదీ మ‌హిళ‌లు ప‌క్క‌నే ఉన్న దేశాల‌కు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశాన్ని మ‌రింత ప్ర‌గ‌తి ప‌థంలో న‌డ‌పాలన్న సంక‌ల్పంతో సౌదీ యువ‌రాజు ఎన్నో సంస్క‌ర‌ణ‌లు విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నారు.
    

Tags:    

Similar News