ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 20వ ద్వైవార్షిక మాహాసభలు డెట్రాయిట్ లో గురు, శుక్ర, శనివారాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అందులో భాగంగా ‘తానా వర్సెస్ తార’ పేరిట జరిగే క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు తెలుగు తారలంతా డెట్రాయిట్ చేరుకున్నారు. బుధవారం రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే క్రికెట్ మ్యాచ్‌కు తెలుగు సినీ నటులంతా ఫుల్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వెంకటేష్, శ్రీకాంత్, తరుణ్, తాప్సీ, రకుల్‌ప్రీత్‌సింగ్ వంటివారంతా ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. అమెరికాలోని తెలుగువారికి కనువిందు చేసేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు.
కాగా తానా మహాసభలకు కేంద్ర మంత్రులు వెంకయ్య, సుజనాచౌదరి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, క్యూబాలో భారత రాయబారి సి.రాజశేఖర్, ఏపీ ఏసీబీ డీజీ మాలకొండయ్య, ఎంపీలు కవిత, సీఎం రమేష్, వీహెచ్, గరికపాటి, రాయపాటి సాంబశివరావు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతో పాటు ఏపీ మంత్రులు పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ తదితరులంతా పాల్గొంటున్నారు.
ఇక సినీ రంగానికి చెందినవారి విషయానికొస్తే వెంకటేష్, నిర్మాత సురేష్, తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, రిచా గంగోపాధ్యాయ, ప్రణతి గంగరాజు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్, నటులు తారకరత్న, రవిబాబు, శ్రీకాంత్, శివాజి, పరుచూరి బ్రదర్స్, తరుణ్, నిఖిల్, లయ, భావన తదితరులు పాల్గొంటున్నారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నృత్యాలు, అందాల పోటీలు, ప్రఖ్యాత గాయకుల మ్యూజికల్ స్టేజి షోలతోనూ సభలను అదరగొట్టనున్నారు.