రాజయోగం అంటేనే అత్యున్నత స్థితి అని అందరికీ తెలిసిందే. మరి రాజులు లేని రోజులలో రాజయోగం అంటే అచ్చంగా అధికార పీఠమే అని చెప్పాలి. ముఖ్యమంత్రి ప్రధాని పదవులను అందుకునే వారిని ఈ యోగం పట్టింది అంటారు. ఇపుడు ఏపీలో అలాంటి అఖండ రాజయోగం ఒకరికి పట్టబోతోంది అని జాతకం చెబుతోంది. ఇంతకీ ఎవరు వారు, ఏమా కధా అంటే కడు ఆసక్తికరమే. ఆయన ఎవరో కాదు. తెలుగు వల్లభుడు నందమూరి తారకరామారావు కుమారుడు బాలక్రిష్ణ.
ఆయన తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ నాలుగు దశాబ్దాలుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు. వందకు పైగా సినిమాలు నటించారు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలలో తనకు సాటి లేదని చెబుతూ తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. అలంటి బాలయ్యకు ఇపుడు జాతకం అద్భుతంగా ఉందని జ్యోతీష్య పండితులు అంటున్నారు.
ఆయన జాతకంలో రాజయోగం, గజకేసరి యోగం వంటివి ఉన్నాయని చెబుతున్నారు. బాలయ్య సినీ విజయాలు కూడా ఇలాంటి యోగాల వల్లనే అంటున్నారు. బాలయ్య తాజాగా నటించిన అఖండ మూవీ అనూహ్యమైన విజయం సాధించడం వెనక కూడా ఈ జాతకం ప్రభావమే ఉందని సినీ జర్నలిస్ట్, జ్యోతీష్య విశ్లేషకులు హేమ సుందరరావు పేర్కొంటున్నారు. ఇక బాలయ్య కేవలం సినీ నటుడే కాదు, హిందూపురం ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్. ఇక టీడీపీ ఆయన తండ్రి ఎన్టీయార్ స్థాపించినది.
మరి బాలయ్య దృష్టి అంతా ఇపుడు సినీ రంగం మీదనే ఉంది కదా ఆయన రాజకీయం ఎలా సాగుతుంది. అఖండ సామ్రాజ్య యోగం ఎలా పడుతుంది అంటే 2025 జనవరి తరువాత ఆయన జాతకంలో కీలకమైన మార్పులు వస్తాయట. దాంతో ఆయనకు రాజయోగం సంప్రాప్తించడం ఖాయమని హేమ సుందరరావు చెబుతున్నారు. బాలయ్యకు ఆ మహర్జాతకం కారణంగా తిరుగు ఉండదని ఆయన అదే ఊపులో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించినా జరగవచ్చు అంటున్నారు. అఖండ సామ్రాజ్య యోగం చాలా అరుదుగా కొందరిలో ఉంటుందని చెబుతున్నారు.
గజకేసరి యోగం ఉండడం, గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వంటి వాటి వల్ల అఖండ సామ్రాజ్య యోగం ఉందని దాంతో బాలక్రిష్ణకు భవిష్యత్తులో బాగా ఉచ్చ స్థితికి అది తీసుకువెళ్తుందని అంటున్నారు. మరి ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. బాలయ్య జాతకం ప్రకారం 2025 జనవరి తరువాత రాజయోగం అంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాల్సిందే. మొత్తానికి ఈ జాతకం మాత్రం బాలయ్య అభిమానులకు తెగ హుషార్ ఇచ్చేలా ఉంది. ఏది ఏమైనా సినీ రంగాన బాలయ్యకు అఖండ సామ్రాజ్య యోగం తాజా సినిమా బ్లాక్ బస్టర్ విక్టరీతో దక్కింది. ఇక ముందు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా వేచి చూడాల్సిందే.