క్లిక్ దూరంలో అనంత సమాచారాన్ని అందించే గూగులమ్మకు కరెంటు షాక్ తగిలింది. తన దగ్గరున్న సమాచారాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకునే గుగుల్మకు దగ్గరున్న సమాచారంలో కొంత పోయిందంట. గూగుల్ లాంటి సంస్థ ఆస్తి మొత్తం తన దగ్గరున్న డేటానే. అలాంటి డేటాను అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంచేస్తారన్న విమర్శ వినిపించినా.. అనుకోనివి జరగటం వల్లే అలాంటి పరిస్థితి ఎదురైందని గూగుల్ చెబుతోందట.
తన దగ్గరున్న సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచుకునే గూగుల్.. ఇందుకోసం భారీ డేటా సెంటర్లలో భద్రంగా ఉంచుతుంది. అలాంటి డేటా ఉన్న సెంటర్లలో బెల్జియంలో ఒకటుంది. ఈ డేటా సెంటర్ దగ్గర అత్యంత శక్తివంతమైన ఉరుములు.. మెరుపులు చోటు చేసుకున్నాయట. దీంతో.. అక్కడి కమ్యూనికేషన్ల వ్యవస్థపైనా.. విద్యుత్తు గ్రిడ్ మీదా ఈ ఉరుములు.. మెరుపుల ఎఫెక్ట్ పడిందట.
దీంతో.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయి.. కొన్ని డిస్కుల్లో ఉన్న డేటా పోయినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా కొంతమంది వినియోగదారుల సమాచారం మొత్తం పోయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే.. తమదగ్గరున్న అత్యాధునిక బ్యాకప్ సాంకేతికతతో రికవరీ చేసినప్పటికీ.. ఎంతోకొంత సమాచారం మాత్రం పోయిందనే చెబుతున్నారు.
తాజాగా చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుకారణంగా గూగుల్ నష్టపోయిన సమాచారం.. తన దగ్గర ఉన్న మొత్తం సమాచారంలో కేవలం 0.0000001 శాతం ఉంటుందని చెబుతున్నారు. ఇకపై.. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించి.. భారీ బ్యాటరీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా గూగులమ్మ దగ్గరున్న సమాచారంలో ఎంతోకొంత అయితే మిస్ అయినట్లే.