కశ్మీర్ సరిహద్దులు చెరిపేసి చూపించిన గూగులమ్మ

Update: 2020-05-10 05:30 GMT
సందేహం ఏమొచ్చినా సమాధానం కోసం వెతికేది గూగులమ్మనే. అంతలా జనాల జీవితాల్లో భాగమైన గూగుల్ తాజాగా జమ్ముకశ్మీర్ సరిహద్దుల్ని చెరిపేసిన చూపిస్తున్న వైనం ఆసక్తికరంగామారింది. తొలిసారి కశ్మీర్ మొత్తాన్ని భారత్ లో భాగంగా గూగుల్ చూపించింది. ఇప్పటివరకే నియంత్రణ రేఖ.. వాస్తవాధీన రేఖ విభజనలతో చూపించేది. అందుకు భిన్నంగా అలాంటి తేడాలేమీ లేకుండా జమ్ముకశ్మీర్ మొత్తాన్ని భారత్ అంతర్భగంగా గూగుల్ మ్యాప్స్ చూపించటం గమనార్హం.

అయితే.. భారత్ లో బ్రౌజ్ చేసే వారికి ఇలా కనిపిస్తున్నా.. భారత్ వెలువల చూసినప్పుడు మాత్రం గూగుల్ మ్యాప్స్ లో కశ్మీర్ పటం.. గతంలో మాదిరే ఎల్ వోసీ.. ఎల్ ఏసీలను కంటిన్యూ చేశాయి. ఎందుకిలా? అంటే.. ఇటీవల భారత వాతావరణ శాఖ తీసుకున్న నిర్ణయమే కారణంగా చెప్పాలి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో పాక్ అక్రమిత కశ్మీర్ ను సైతం భారత్ లో అంతర్భాగంగా చూపిస్తూ.. వాతావరణ రిపోర్టును కూడా విడుదల చేస్తామని చెప్పటం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే గూగుల్ కూడా కశ్మీర్ మొత్తాన్ని భారత్ లో అంతర్భాగంగా చూపిస్తుందని చెబుతున్నారు. అయితే.. భారత్ వెలుపల మాత్రం యథాతధ స్థితిని అమలు చేయటాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఈ పరిణామం మీద కేంద్ర ప్రభుత్వం కానీ.. గూగుల్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. జరగాల్సిన మార్పు జరిగిపోయింది.
Tags:    

Similar News