కవిత కోరికను లైట్ తీసుకున్న గూగుల్

Update: 2018-10-15 10:21 GMT
ఎంపీ కవిత.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు.. అంతేనే.. టీఆర్ఎస్ ఎంపీ... అంతేకాదు.. తెలంగాణ బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిస్తూ ఈ పండుగకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొస్తున్నారు. ఈసారి ఎన్నికలు ఉండడంతో కవిత పాల్గొనడం లేదు. లేకుంటే ఇప్పటికే దేశవిదేశాలు చుట్టివచ్చేవారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత పేర్లు చెప్పగానే ఇట్టే పనులైపోతాయి. అంతటి భయంతో కూడిన భక్తి వల్ల గౌరవాన్ని వ్యవస్థలన్నీ మెయింటేన్ చేస్తున్నాయి. కేసీఆర్ మీడియా మేనేజ్ మెంట్, ఓటుకు నోటు, నయింలాంటి హంతకులను చంపేశాక మొత్తం వ్యవస్థ సెట్ రైట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఈ ముగ్గురి కేంద్రంగానే తెలంగానలో పరిపాలన సాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..

కవిత చెప్పిందని ఏకంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నేత డీ శ్రీనివాస్ ను పక్కన పెట్టేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా కవిత తన ప్రభావాన్ని చూపుతున్నారు.. అలాంటి కవిత చెప్పినా ఓ సంస్థ  పెడచెవిన పెట్టింది. కవిత ప్రతిపాదనను కనీసం పట్టించుకోలేదు. ఎంటా సంస్థ.? అంత సాహసం చేసిందెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ యావత్తు పూలసింగిడిగా మారే బతుకమ్మ పండుగకు వేళయ్యింది. మహిళలందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ ప్రాచీన పండుగ ప్రాశస్త్రం దృష్ట్యా ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ సంస్థను ‘డూడుల్’గా పెట్టాలని ఎంపీ కవిత కోరారు. కొద్దిరోజుల క్రితం ఈ మేరకు ఆమె గూగుల్ ను ఉద్దేశించి విన్నవించారు. తెలంగాణ ప్రజలు ఎంతో సంబురంగా చేసుకునే ఈ పండుగను గూగుల్ డూడుల్ గా పెట్టాలని కోరారు. అయితే ఈ విషయాన్ని గూగుల్ పెడచెవిన పెట్టింది. పండుగ మరో రెండు రోజులు మాత్రమే ఉన్నా ఇప్పటివరకూ గూగుల్ ఆ పని చేయలేదు.

తెలంగాణ జీవన విధానానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగకు గుర్తింపు తేవడం వరకూ ఓకే కానీ.. దాన్ని కంపెనీలకు, ఇతరుల మీద రుద్దడమే ఇక్కడ సమస్యగా మారింది.. గూగుల్ ప్రపంచ ప్రఖ్యాత సెర్చింజన్. ఇది ఏ ఒక్క ప్రాంతానికో.. ప్రదేశానికో పరిమితం కాదు.. దేశం, ప్రపంచం గుర్తింపు పొందే వారినే డూడుల్ గా పెడుతుంది.ఇది తెలంగాణ ప్రాంత పండుగ కావడంతోనే గూగుల్ ఈ పనిచేయలేదు. ఒకవేళ బతుకమ్మను డూడుల్ గా పెడితే నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఉండే బోలెడన్నీ ఈవెంట్స్ ను కూడా ఇలాగే పెట్టాలని డిమాండ్ రావడం సహజం. ఈ కారణంతోనే కవిత ప్రతిపాదనను గూగుల్ లైట్ తీసుకున్నట్టు సమాచారం.

కొసమెరుపు ఏంటంటే ఎంపీ కవిత.. బతుకమ్మ జరిగే తొమ్మిది రోజులు  డూడుల్ గా పెట్టాలని గూగుల్ ను కోరింది. కానీ ఒక్కరోజు కూడా పెట్టకుండా గూగుల్ షాకిచ్చింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత మాటను కూడా లైట్ తీసేసుకున్న గూగుల్ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News