ఈ-కామర్స్ రంగంలోకి గూగుల్..

Update: 2018-06-24 04:53 GMT
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్ ను బంగారు బాతుగా భావిస్తోంది. అందుకే ఏ కొత్త టెక్నాలజీ అయినా సరే భారత్ లోనే లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. చైనా దేశం గూగుల్ కు పోటీగా సొంతంగా సెర్చింజన్ సహా ఇతర సేవలను కొనసాగిస్తుండడంతో రెండో అత్యధిక జనాభా గల భారతే ఇప్పుడు గూగుల్ కు ప్రత్యామ్మాయంగా కనపడుతోంది.

గుగుల్ భారత్ ను టార్గెట్ చేసింది. దేశం ఈకామర్స్ రంగంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.  అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ ఈ ఏడాదికల్లా భారత్ లో ఈకామర్స్ రంగంలోకి దిగేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇతర వర్ధమాన మార్కెట్లోకి వెళ్లేముందు భారత్ లో మొదలు పెట్టి చూడాలని భావిస్తోంది. ఇక్కడ మార్కెట్ విస్తృతి ఉండడమే ప్రారంభించానికి కారణంగా తెలుస్తోంది.

ప్రస్తుతం దేశీయ ఈకామర్స్ మార్కెట్ విలు 3850 కోట్ల డాలర్లు.. అంటే దాదాపు 2.58 లక్షల కోట్లు. 2020 కల్లా 6.70లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఇంత పెద్ద భారతీయ మార్కెట్ ను చేజిక్కించుకోవాలని గూగుల్ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.

అయితే గూగుల్ నిర్ణయంతో దేశంలోని టాప్ ఈకామర్స్  సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లు గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్.. ఫ్లిప్ కార్ట్ లో 77శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒక సమయంలో వాల్ మార్ట్ తో కలిసి గూగుల్ సైతం ఫ్లిప్ కార్ట్ సంస్థలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచింది. కానీ చివరకు మనసు మారి తానే సొంతంగా ఈకామర్స్ రంగంలోకి అడుగుపెట్టాలని తాజాగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే  భారతీయ మార్కెట్ లో త్రిముఖ పోటీ అనివార్యం కానుంది. దీని వల్ల వినియోగదారులకు ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి.
Tags:    

Similar News