కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే శక్తిమంతమైన ఆయుధం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు ఇప్పటికే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని దేశాల్లోనూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం యాక్టివ్ గా జరుగుతోంది. కాగా పలు సంస్థలు కూడా ఇందుకు సహకరిస్తున్నాయి. ఉద్యోగులు టీకా తీసుకుంటేనే విధులకు అనుమతిస్తున్నాయి. వ్యాక్సిన్ స్టేటస్ సమర్పించని వారి పట్ల పలు నిబంధనలు విధిస్తున్నాయి. వ్యాక్సిన్ స్టేటస్ పై గూగుల్ కూడా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులకు కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది.
గూగుల్ ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆ సంస్థ నిర్ణయించింది. టీకా స్టేటస్ ను సమర్పించాలని ఓ గడువు విధించింది. ఇందుకు సంబంధించిన మెమో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీకా తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. డిసెంబర్ 3లోపు వ్యాక్సిన్ స్టేటస్ సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎన్ని విజ్ఞప్తులు చేసినా పరిగణలోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. ఆలోపు టీకా వివరాలు సమర్పించకపోతే జీతాల్లో కోత విధిస్తామని లేదంటే ఉద్యోగంలో నుంచి తీసేసే అవకాశం ఉందని ఆ మెమోలో పేర్కొంది. జనవరి 18, 2022 లోపు వ్యాక్సిన్ తీసుకోనివారిపై చర్యలు చేపడుతామని వెల్లడించింది. ఈ మెమోను పలు వార్తా సంస్థలు ప్రచురించాయి.
గూగుల్ మెమో ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులను పెయిడ్ లీవ్ మీద పక్కన పెడతామని అందులో ఉంది. ఆ తర్వాత శాశ్వతంగా విధుల నుంచి తొలగించనున్నట్లు అందులో ఉంది. ఈ విధంగా వ్యాక్సినేషన్ పై గూగుల్ సంస్థ చాలా సీరియస్ గా తీసుకుంది. ఉద్యోగులు కచ్చితంగా టీకా తీసుకోవాల్సిందేనని అందులో ఉంది. అయితే దీనిపై స్పందించేదుకు గూగుల్ ప్రతినిధులు నిరాకరించారు. దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగుల పాలిట ఇంత కఠినంగా వ్యవహరించడం కరెక్టు కాదని అంటున్నారు. అయితే వైరస్ ను ఎదుర్కొవడానికి టీకా అవసరం కూడా చాలా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇది ఏమాత్రం తప్పుకాదని కామెంట్ చేస్తున్నారు.
ఒమిక్రాన్ ప్రభావంతో గూగుల్ ఇటీవలె వర్క్ ఫ్రమ్ హోం గడువును పొడగించింది. ఉద్యోగుల భద్రతా దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు ఇంటి నుంచి పని విధానాన్ని అంగీరించింది. అంతేకాకుండా భారీ మొత్తంలో బోనస్ ను సైతం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఉంటాయని ప్రకటించింది. అప్పటిదాకా వర్క్ ఫ్రమ్ హోం పద్దతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉద్యోగుల క్షేమం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది.