పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను తమ దేశంలో కంటే భారత్ లోనే ఎక్కువ ప్రేమ దొరుకుతుందని.. అప్యాయంగా చూస్తారంటూ పేర్కొనటం గమనార్హం. భారత్‌లో క్రికెట్ అన్న వెంటనే తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని.. భారత్‌కు వచ్చిన ప్రతిసారీ ఎంతో ప్రేమగా.. అప్యాయతతో భారత ప్రజలు స్వాగతిస్తారని అఫ్రిది చెప్పుకొచ్చారు. సొంత దేశంలో కూడా తమకింత ప్రేమ లభించదని చెప్పటం గమనార్హం.
పాక్.. భారత్ దేశాలను క్రికెట్ చాలా దగ్గర చేసిందన్న అఫ్రిది.. ఆట.. రాజకీయం రెండూ భిన్నమైన అంశాలుగా పేర్కొన్నారు. తొలి మ్యాచ్ ఎప్పటికి చాలా ముఖ్యమైనదని.. తమ రెండో మ్యాచ్ (మార్చి 19) భారత్ తోనే అని.. అది చాలా కీలకమైనదని చెప్పుకొచ్చారు. ఏమైనా తాజాగా అఫ్రిది చేసిన వ్యాఖ్యలు భారతీయల మనసుల్ని దోచుకునేలా చేసిందనే చెప్పాలి. మరి.. అతగాడి మాటలపై పాకిస్థానీయులు ఎలా స్పందిస్తారో..?