టీవీ9 విషయాలు నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తున్నాయి. వందల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఛానల్ నిర్వహణ తమకు నచ్చినట్లు.. తాము మెచ్చినట్లు కాకుండా.. ఎవరో చేతుల్లో పెట్టి నడపటమా? అంటూ మైహోం.. మెగా కంపెనీల అధినేతల ఆవేదన కాస్తంత తగ్గి ఉంటుందని చెప్పాలి. రవిప్రకాశ్ ఎగ్జిట్ చేసి.. కొత్తగా మిశ్రా.. సింగారావులను టీవీ9 కీ పర్సన్స్ గా మార్చేస్తూ తీసుకున్న నిర్ణయం మీడియాలోనూ.. మిగిలిన జనాల్లోనూ బాగానే వెళ్లిపోయినట్లే.
తాజ్ దక్కన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తి కావటం.. టీవీ9కు కొత్త సీఈవోగా టీవీ9 కన్నడ ఛానల్ బాధ్యతల్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్న మహేంద్ర మిశ్రాను టీవీ9 తెలుగు సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. టీవీ9 సీఎఫ్ వోగా వ్యవహరిస్తున్న మూర్తిని తొలగించి.. ఆ ప్లేస్ ను గొట్టిపాటి సింగారావుకు అప్పగిస్తూ టీవీ9 కొత్త యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
తాజ్ దక్కన్ ప్రెస్ మీట్ తర్వాత (విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) టీవీ9 ఛానల్ కు వెళ్లిన కొత్త రథసారధులు సిబ్బందితో పరిచయ కార్యక్రమం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటిలానే పని చేయాలని కోరటంతో పాటు.. వారికున్న చిన్న చిన్న సందేహాల్ని నివృతి చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వారిలో నెలకొన్న నిరాశను తొలగించి.. కొత్త భరోసా కలిగించే ప్రోగ్రాంను పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.
తాజా ప్రకటన ప్రకారం టీవీ9 తెలుగు ఛానల్ విషయాల్ని సంపూర్ణంగా మహేంద్ర మిశ్రా చూస్తారని చెబుతున్నారు.. ఆ బాధ్యతను నిర్వర్తించే బాధ్యత గొట్టిపాటి సింగారావుదేనన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం 10టీవీ సీఈవోగా వ్యవహరిస్తున్న సింగారావు.. టీవీ9 సంగతులన్ని చూడనున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ గొట్టిపాటి సింగారావు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర సంగతులు తెలుస్తాయి.
గొట్టిపాటి సింగారావు ఇప్పటోడు కాదు. అప్పుడెప్పుడో ఈనాడులో బిజినెస్ రిపోర్టర్ గా విజయవంతంగా వ్యవహరించారు. కారణం ఏమైనా కానీ.. చాలామందికి భిన్నంగా ఈనాడుకు తనకు తానే గుడ్ బై చెప్పేసిన అతి కొద్దిమంది సీనియర్లలో అతడొకరు. అనంతరం తనకున్న కార్పొరేట్ పరిచయాలతో మీడియాను దాదాపుగా వదిలేసినప్పటికీ.. మీడియా సంస్థలు మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు.
స్వాభావికంగా మంచి మనసు సింగారావు సొంతంగా చెబుతారు. జంటిల్ గా వ్యవహరిస్తారని.. తాను చేయాల్సిన పనిని మొరటుగా కాకుండా.. తెలివిగా చేయిస్తారని చెబుతారు. వర్క్ మైండ్ గా చెప్పే సింగారావు తన పని తాను చూసుకోవటమే తప్పించి.. వివాదాల జోలికి అస్సలు వెళ్లరని చెబుతారు. కార్పొరేట్ ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న సింగారావుకు తాజాగా టీవీ9 టాస్క్ మాత్రం అంత ఈజీ కాదని చెప్పక తప్పదు. సీఈవోగా మిశ్రా ఉన్నప్పటికీ.. టీవీ9 కార్యకలాపాలన్ని సింగారావే చూసుకోవాలన్న మాటను తాజా ఇన్వెస్టర్లు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
జర్నలిజం.. వ్యాపార విశ్లేషణ.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్.. ఇన్వెస్టర్ రిలేషన్స్ లాంటి విషయాల్లో తలపండిన గొట్టిపాటి సింగారావుకు టీవీ9 టాస్క్ పెద్దదైతే కాదని చెప్పక తప్పదు. మా టీవీలో ఆరేళ్ల అనుభవంతో పాటు.. మా యాజమాన్యం స్టార్ చేతుల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని స్మూత్ గా నడిపించిన పేరున్న సింగారావుకు.. ఆ అనుభవం తాజా టీవీ9లో అక్కరకు వస్తుందని చెప్పాలి. ఏమైనా.. ఒక సీనియర్ జర్నలిస్టు చేతుల్లో టీవీ9 తన ట్యాగ్ లైన్ అయిన మెరుగైన సమాజం కోసం ప్రయాణం ఎలా చేస్తుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.