బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంటే దేశమంతా హడల్. మోదీ తరువాత దేశంలో అంతటి బలమైన శక్తిగా ప్రొజెక్ట్ అవుతూ బీజేపీని నడిపిస్తున్న నేత. కానీ.. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా పలాసలో మాత్రం ఒక సాధారణ ఎమ్మెల్యే ఆయన్ను అడ్డుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకుంటూ చేపట్టే బస్సు యాత్ర కోసం వచ్చిన ఆయన్ను ఏపీకి ఎందుకు అన్యాయం చేశారంటూ నిలదీస్తూ అడ్డుకున్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ. సర్దార్ గౌతు లచ్చన్న తనయుడైన ఈ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే అమిత్ షా - బీజేపీ నేతలకు అడుగడుగునా అడ్డు తగులుతూ తన అనుచరులతో కలిసి అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను శాంతింపజేయాల్సి వచ్చింది.
పలాసలో ఎదురైన అనుభవంతో ఏపీకి చేసిన అన్యాయంపై రాష్ట్ర ప్రజల్లో బీజేపీ అంటే ఏ స్థాయిలో కోపం ఉందో స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకే తెలిసొచ్చింది.శివాజీ నాయకత్వంలోని టీడీపీ శ్రేణులు రహదారిపై బైఠాయించి అమిత్ షా గో బ్యాక్ - మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులకు పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టారు. ఎమ్మెల్యే గౌతు శివాజీ సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం ప్రధాని మోదీ నిలబెట్టుకోవడం లేదంటూ శివాజీ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. తెలుగు వాడు ఎదుగుతుండే తొక్కేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. తిత్లీ తుపానుతో కకావికలమైన ఉత్తరాంధ్ర కనీసం చూడటానికి కూడా రాని బీజేపీ పెద్దలు ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం అమలు చేస్తున్న 126 సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త ప్రచారంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం పర్యటిస్తోంది. అందులో భాగంగా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా నిర్వహించే బస్సు యాత్ర ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభమైంది. దానికోసం వచ్చిన అమిత్ షాకు ఆదిలోనే బలమైన షాక్ తగిలింది.శివాజీ స్పూర్తితో బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటామని ఏపీ టీడీపీ నేతలు అంటున్నారు.