కొమ్ములు తిరిగిన మొనగాళ్లు లాంటి రాజకీయ నేతలు సైతం చేయలేని పనిని రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ చేశారా? ఆయన దెబ్బకు రెండు రాష్ట్రాల్లోని అత్యంత బలోపేతమైన ఒక వర్గానికి చెమటలు పడుతున్నాయా? అంటే అవుననే చెబుతున్నారు.
మిగిలిన నేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోని వైద్య రంగంపై గవర్నర్ నరసింహన్ రెగ్యులర్ గా సటైర్లు వేస్తుంటారు. గతంలో రెండు మూడుసార్లు.. వైద్యరంగం మీద విమర్శలు చేయటం తెలిసిందే. ఆ మధ్యన ఒక సభకు హాజరైన ఆయన.. ఒక ఆసుపత్రిలో చేసిన ఒకేలాంటి వైద్యానికి మరో ఆసుపత్రిలో అంతకు మించి వసూలు చేయటం ఏమిటి? చేసే వైద్యం ఒకేలాంటిది అయినప్పుడు..ఆసుపత్రిని బట్టి ఫీజులు వసూలు చేయటం ఏమిటి? అని ప్రశ్నించటమే కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందించాలని కూడా చెప్పారు.
నిత్యం ఏదో ఒక పంచాయితీ రాజకీయాలు చేసుకోవటానికే సరిపోని ఇద్దరు చంద్రుళ్లు గవర్నర్ మాటను లైట్ తీసుకున్నారు. తాజాగా.. మరోసారి వైద్య రంగానికి సంబంధించి ప్రైవేటు మెడికల్ కళాశాలలపై గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. త్వరలో తాను సాధారణ పౌరుడ్ని కానున్నట్లు చెప్పిన ఆయన.. ప్రైవేటు మెడికల్ కాలేజీలు సీటుకు ఇంత చొప్పున చేస్తున్న వసూళ్ల మీద దృష్టి సారించటమే కాదు.. ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించటం ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు చెమటలు పట్టిస్తున్నాయని చెబుతున్నారు.
మెడికల్ సీటుకు కోటి చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలు.. ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయిలు (ఒక అంచనా ప్రకారం అన్నీ ప్రైవేటు కాలేజీలు ఏడాదికి ఈ విధంగా వసూలు చేసేది రూ.1500కోట్లు ఉంటుందని చెబుతున్నారు) వెనకేసుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. మొత్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల దోపిడీపై నిర్మోహమాటంగా మాట్లాడటమే కాదు.. విచారణకు ఆదేశించినట్లుగా చెబుతున్న మాట కలకలం రేపుతోంది. మరి.. ఈ విషయంపై విచారణకు ఆదేశించారా? లేదా? అన్న విషయంపై అధికారికంగా ఇప్పటి వరకూ ఎవరూ వెల్లడించని వైనం. మొత్తంగా.. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు గవర్నర్ నరసింహ.. నరసింహావతరాన్ని చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.