తాజాగా ఆంధప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో ప్రకాశంజిల్లాకి చెందిన వినూత్నరెడ్డి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదివే అమ్మాయి ఎంపీసీ విభాగంలో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచింది. వినూత్న రెడ్డి మొదటి సంవత్సరం ఇంటర్ లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించంది. ఈ మర్క్స్ చాలామందికి వచ్చాయి కదా అనుకుంటే పొరపాటే .. వినూత్న రెడ్డి ..రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో లక్షలు పోసి చదివి ఈ మార్కులు తెచ్చుకోలేదు..గవర్నమెంట్ కాలేజ్ లో చదివి స్టేట్ టాపర్ గా నిలిచింది.
ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వినూత్న రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ తాజాగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించంది.
ఈ అమ్మాయి ప్రతి రోజు మార్కాపురంలో నివాసముంటూ పెద్దారవీడు బస్సులో వెళ్లి ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటుంది. వినూత్న రెడ్డికి తండ్రి లేరు. తల్లి సుందరమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తుంది. తండ్రి లేకపోవడం , తల్లి కష్టాన్ని గుర్తించిన వినూత్న రెడ్డి.. బాగా చదివి , మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్ లో మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ... ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ, దృఢ సంకల్పంతో చదివి కార్పొరేట్ స్టూడెంట్స్ కి దీటుగా స్టేట్ టాప్ మార్కులు సాధించింది. వినూత్న రెడ్డిని ఆర్ఐఓ వివి, కళాశాల ప్రిన్సిపల్ కెవి సుబ్బారెడ్డి అభినందించారు.