కోవిడ్-19 అలియాస్ కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ 80కి పైగా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇరాన్ - ఇటలీలలో ఆదివారం ఒక్క రోజే దాదాపు 135 మందిని కరోనా పిశాచి బలి తీసుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెల్లమెల్లగా భారత్ పైనా కరోనా పంజా విసురుతోంది. నానాటికీ కరోనా పాజిటివ్ - అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, భారత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా భారత్ లో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 43 కి చేరింది. ఇప్పటికే కరోనాను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేంద్రం....తాజాగా మరిన్ని పటిష్ఠ చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నిరోధానికి పలు కీలకమైన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
విదేశాల నుంచి వచ్చే నౌకలను భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బహిరంగ సభలు - సమావేశాలకు అనుమతినివ్వకూడదని నిర్ణయించిన కేంద్రం....తప్పనిసరైతే తగిన జాగ్రత్తలు పాటించి సభలు నిర్వహించుకోవాలని సూచించింది. కరోనా అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం - లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరామని తెలిపారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో 8 లక్షల మందికి కరోనా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించామని, 3,000 మందిని ఐసోలేషన్‌లో ఉంచి, పర్యవేక్షిస్తున్నామని వివరించారు. గడిచిన 3 రోజుల్లో కరోనా పరీక్షల కోసం కొత్తగా 31 ల్యాబ్ లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 56 చోట్ల నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ టీమ్ ల ఏర్పాటుకు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపామని చెప్పారు.