హిందువులకే ఉద్యోగాలు.. జగన్ సంచలనం

Update: 2019-09-29 10:49 GMT
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల ఓ అన్యమస్థుడు పనిచేస్తున్నాడని.. అతడి ఇంటిలోని మతం, వేడుక చేసుకుంటున్న తీరు గురించి వీడియో  సైతం రిలీజ్ చేసి కొందరు రచ్చ చేసిన సంగతి తెలిసింది..దీంతో జగన్ సర్కారు అన్యమతస్థులను టీటీడీపీలో ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తోందని బీజేపీ  సహా చాలా పార్టీలు, నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..

అందుకే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది. అన్యమతస్థులను అనుమతించరని తెలిపింది.

ఈ ఆదేశాలు ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేస్తుంటే వారిని వేరే శాఖాల్లో మార్పు చేయాలని ప్రభుత్వం ఆ జీవో స్పష్టం చేసింది.

టీటీడీ సహా ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరులు ఉంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే విజిలెన్స్ శాఖకు అందిస్తే నిజనిర్ధారణ చేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
    

Tags:    

Similar News