తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలపై సర్కార్ కీలక నిర్ణయం

Update: 2021-06-28 17:30 GMT
జూలై 1 నుంచి ప్రత్యక్షంగా పాఠశాలలు, తరగతులు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించడానికి రంగం సిద్ధం అవుతున్న వేళ అనుకోని పరిణామం ఎదురైంది. కరోనా ప్రభావం ఉండడం.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సెట్స్ పరీక్షలు యథాతథమని సోమవారం నాటి ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణలో టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందనని మంత్రి సబిత తెలిపారు. రికార్డ్ చేసిన పాఠాలు అన్నీ టీశాట్ యాప్స్ లో అందుబాటులో ఉంటాయన్నారు.తెలంగాణలో 46 జీవో యథాతథంగా అమలు అవుతుందని మంత్రి సబిత తెలిపారు. ఈ ఏడాది కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు. 30శాతం ఫీజులు తగ్గించుకోమని విజ్ఞప్తి చేశారు.

కరోనా కల్లోలంతో ఏడాదిగా చదువులు సాగడం లేదు. పోయిన ఏడాది చివర్లో, ఈ ఏడాది మొత్తాన్ని కరోనా మింగేసింది. వరుసగా రెండేళ్లు పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయిపోయారు. దీంతో సర్కార్ ఈ ఏడాది అయినా పాఠశాలను తిరిగి తెరవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలిసింది. కానీ కోర్టులు, తల్లిదండ్రుల భయాల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులకే తెలంగాణ సర్కార్ మొగ్గుచూపుతోంది.
Tags:    

Similar News