పంచాయతీ ఎన్నికలంటేనే పచ్చని పల్లెల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రతి వ్యక్తి పోటీ చేసి సత్తా చాటాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంత కొంత వివాదాలు, గ్రామంలో రాజకీయాలు మారుతాయి. దీంతో పంచాయతీల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. ఈ పరిణామాలు గ్రామంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. అందుకే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దానికి ప్రోత్సాహకంగా పెద్ద మొత్తంలో భారీ నజరానా ప్రకటిస్తుంటాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే భారీ నజరానాలు ప్రకటించింది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో వాటిని ఏకగ్రీవం గా చేసుకుంటే ఆ పంచాయతీలకు ప్రత్యేక గ్రాంట్లు అందనున్నాయి. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికను ఏకగ్రీవం చేసి, ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చును, పల్లెల్లో అనవసరమైన టెన్షన్ ను లేకుండా చేస్తే.. ఆయా పంచాయతీలకు భారీ స్థాయిలో నిధులు అందే అవకాశం ఉంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వానికి భారీ ఆదాయం, బందోబస్తు, ఎన్నికల విధులు తదితర వంటి వాటితో ఖర్చుతో పాటు శ్రమతో కూడిన పని. ఏకగ్రీవంగా పంచాయతీ ఎన్నికలు సాగితే అవన్నీ తొలగి పోతుండడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీ ఎంత నజరానా అనేది పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగుతోంది.
ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా
- 2 వేల జనాభాలోపు ఉన్న పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.5 లక్షల రూపాయల నజరానా
- 2 నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీ లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు
- 10 వేల జనాభా వరకు ఉన్న పంచాయతీ లో ఓటింగ్ జరగకపోతే రూ.15 లక్షలు
- అంతకుమించి జనాభా ఉన్న మేజర్ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.20 లక్షల నిధులు అందనున్నాయి.
సాధారణ నిధులతో పాటు ఏకగ్రీవ పంచాయతీలకు ఈ నజరానాలు అదనంగా అందనున్నాయి. ఈ ఏకగ్రీవ పంచాయతీలు చేసేందుకు అధికార పార్టీ వైఎస్సార్సీపీ తీవ్రంగా కష్టపడుతోంది. ఎంత ఎక్కువ ఏకగ్రీవ పంచాయతీలు అయితే అంత అవన్నీ అధికార పార్టీ కిందకే పరిగణిస్తారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పటిష్టంగా చర్యలు తీసుకుంటోంది. మరి ఇది ఏ మేరకు విజయవంతమవుతుందో, ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతాయో వేచి చూడాలి.