లంచం తీసుకుంటూ సీసీ టీవీలో చిక్కిన అధికారి

Update: 2021-02-07 04:47 GMT
ప్రభుత్వ అధికారులు అయ్యిండి ఏకంగా ప్రభుత్వ ఆఫీసుల్లోనే యథేచ్ఛగా లంచం తీసుకుంటుండడం విస్తుగొలుపుతోంది. ఇలాంటి చాటుమాటు వ్యవహారాలన్నీ సాధారణంగా బయట జరుగుతాయి. అధికారుల అనుచరులు వీటిని పర్యవేక్షిస్తారు.. అయితే అవినీతి అర్జనకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు ఏకంగా ఆఫీసుల్లోనే లంచం తీసుకుంటూ  చెలరేగిపోతున్నారు.

తాజాగా లంచం తీసుకుంటున్న అధికారిని సీసీ కెమెరానే పట్టించిన వైనం శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో జరిగింది. ఆమె ఆఫీసులోనే లంచగొండితనాన్ని సీసీ పుటేజీ బట్టబయలు చేయడం విశేషం.

శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కుసుమ కుమారి.. ఓ కర్మాగారం తనిఖీల ధ్రువీకరణ కోసం అనుమతి ఇచ్చేందుకు యజమాని వద్ద లంచం తీసుకుంది. అంతలోనే ఆమెకు ఆఫీసులో సీసీ కెమెరాలున్నాయన్న సంగతి గుర్తుకు వచ్చినట్లుంది..

కానీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ధీమాతో కుసుమ కుమారి నిర్లక్ష్యం వహించింది. ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సీసీ కెమెరా పనిచేసింది. లంచం తీసుకున్న డబ్బు చూపిస్తూ ఆమె సీసీ టీవీనే వెక్కించిన వైనం వీడియోలో రికార్డ్ అయ్యింది.

చివరకు అధికారి లంచగొండితనం సీసీ కెమెరాలో బట్టబయలైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News