ఎస్‌ బీఐని వేడుకుంటున్న మోడీ స‌ర్కారు

Update: 2017-03-06 17:24 GMT
ఖాతాదారులు తమ ఖాతాలలో కనీస నగదు నిల్వ ఉంచకపోతే అపరాధ రుసుము వసూలు చేయాలన్న బ్యాంకుల నిర్ణయంపై పెద్ద ఎత్తున  వ్య‌క్త‌మైన నిర‌స‌న‌లు కేంద్రం దృష్టికి చేరిన‌ట్లున్నాయి. ఈ విష‌యంపై తాజాగా కేంద్రంగా స్పందించింది. చార్జీల అమ‌లు నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం అపరాధ రుసుము వసూలుపై పునరాలోచించాలని బ్యాంకులను కోరింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ అయిన‌ ఎస్‌బీఐకి లేఖ రాసింది.

తాజాగా బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. క్యాష్ డిపాజిట్లు, ఏటీఎం విత్‌  డ్రాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఏటీఎం నుంచి నెలలో ఐదుసార్లు మాత్రమే ఫ్రీగా విత్‌   డ్రా చేసుకోవచ్చు. పరిమితి ధాటిన తర్వాత ఒక్కో విత్‌  డ్రాపై పది రూపాయలు వసూలు చేస్తారు. ఐతే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడుసార్లకు మాత్రమే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత  ఒక్కో ట్రాన్సాక్షన్‌  పై 20 రుపాయలు ఛార్జీ వసూలు చేయనున్నారు. దాంతో పాటు నగదు డిపాజిట్లను మూడుకు తగ్గించారు. మూడు ధాటితే ఆ తర్వాత డిపాజిట్లపై సేవా పన్నుతో పాటు 50 రుపాయలు అదనంగా వసూలు చేస్తారు. మినిమం బ్యాలెన్స్‌  మెంటేన్‌  చెయ్యకపోతే 100 రుపాయల ఫైన్‌  కూడా విధిస్తారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.

ఈ వార్త‌లు తీవ్ర క‌ల‌క‌లం రేకెత్తించ‌డం, యూపీలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ప్ర‌భుత్వం సారథ్యంలో ఉన్న ఎస్‌ బీఐకి నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది. కాగా, ప్రైవేటు రంగంలోకి అగ్ర‌గామి బ్యాంకులైన ఐసీఐసీఐ - హెచ్‌ డీఎఫ్‌సీలు ఇప్ప‌టికే చార్జీల భారాన్ని వేయాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News