కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. విజయా బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ బరోడా - దేనా బ్యాంక్ లను విలీనం చేయనున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విలీనంతో దేశంలోనే మూడవ అతి పెద్ద బ్యాంకుగా ఇది అవతరించనుంది. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ - బ్యాంకుల విలీనం కేంద్ర ప్రభుత్వ అజెండాలో ఉందనే విషయం బడ్జెట్ లోనే తాను ప్రకటించామని తెలిపారు. తొలి అడుగును ఇప్పుడు ప్రకటించామని... త్వరలోనే విధివిధాలను ప్రకటిస్తామని చెప్పారు.
ఈ విలీనంతో మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగులెవరికీ ఇబ్బందులు ఉండవని... ఉత్తమ సర్వీసు నిబంధనలను అందరికీ అమలు చేస్తామని జైట్లీ తెలిపారు. బ్యాంకుల క్యాపిటల్ అవసరాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ విలీన ప్రక్రియలో ఈ మూడు బ్యాంకుల ఉద్యోగుల భద్రతను కాపాడతామన్నారు. ఈ సందర్భంగా ఎస్ బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం సందర్భంగా ఎలాంటి ఉద్యోగ నష్టం జరగ లేదని ఆయన గుర్తు చేశారు. విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు మూలధన మద్దతును కూడా అందిస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు. దీనిపై ఆయా బ్యాంకుల బోర్డుల తుది ఆమోదం తర్వాత విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు