రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఏ విషయంలో అయినా దాదాపుగా అప్ డేటెడ్ గా ఉంటారన్నది తెలిసిందే. కానీ.. ఊహించని విధంగా ఆయన సినిమాల విషయంలోనూ అప్ డేటెడ్ గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వారు.. కీలక బాధ్యతలు నిర్వర్తించేవారు సినిమాలు చూసే సమయం ఉండే అవకాశం లేదు. అందులోకి తమిళుడైన గవర్నర్.. తెలుగు సినిమాల్ని బాగానే చూస్తారన్న విషయం తాజాగా ఆయన మాట్లాడిన మాటలు చెప్పేశాయి. సంప్రదాయం ప్రకారం రాజ్ భవన్ కు పిలిపించుకొని మాట్లాడాల్సి ఏపీ ముఖ్యమంత్రిని.. తానే స్వయంగా కలుసుకునేందుకు సిద్ధమైన గవర్నర్ ఏపీ రాజధానికి రావటం తెలిసిందే.
ఏపీ సీఎంతో భేటీ అయిన తర్వాత.. విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా పలు ప్రశ్నలు సంధించింది. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే.. రాజ్ భవన్ లో కాకుండా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి సమావేశం కావటాన్ని మీరు ఎలా భావిస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అత్తారింటికి దారేది అని ఒక సినిమా వచ్చింది కదా. అలా నేను అత్తారింటికిదారి చూపిస్తానంటే మీరు (మీడియాను ఉద్దేశించి) తప్పంటున్నారు. నేను ఇక్కడికి రావటంలో తప్పేం లేదు. చిన్న కుటుంబంలోనే అనేక సమస్యలు ఉంటాయి. ప్రజలకు నాయకత్వంపై నమ్మకం ఉంది. మీడియానే సమస్యలు సృష్టిస్తోంది’’ అంటూ గవర్నర్ చెప్పుకొచ్చారు.
మరి.. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయన్న ప్రశ్నకు బదులిస్తూ.. అన్ని సమస్యలు పరిష్కారం అయితే మీకు (మీడియా ప్రతినిధులను ఉద్దేశించి) ఉద్యోగాలు ఉండవు.. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి ప్రశ్నకు మీడియాను ఏసుకునేలా మాట్లాడుతున్న గవర్నర్ తీరు చూస్తుంటే.. ఆయనకు మీడియా మీద చాలానే అపోహలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరుసీఎంల మధ్య గొడవలతోనే మీడియాలో ఉద్యోగాలు వచ్చేస్తాయా? అన్నది ఒక ప్రశ్న అయితే.. మీడియానే సమస్యల్ని సృష్టిస్తోందని.. రెండు రాష్ట్రాల్లోని నాయకత్వాల మీద ప్రజల్లోనమ్మకం ఉందన్న గవర్నర్ మాటను విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. అన్ని విషయాల్లో అప్ డేటెడ్ గా ఉన్న గవర్నర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఏ మేర వ్యవహరిస్తుందన్న విషయంలో గవర్నర్ సారు అప్ డేటెడ్ గా లేరన్న విషయం అర్థమవుతుంది. ఎందుకిలా గవర్నర్ సారూ..?