రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ ఏం చేయాలో అది చేసుకుంటూ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ మాట మాట్లాడినా దానికి చెల్లించాల్సిన మూల్యం ఎక్కువ ఉంటుందన్న విషయం ఆయనకు తెలియంది కాదు.
గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన గవర్నర్‌కు ఎప్పుడు.. ఏం మాట్లాడాలో తెలియంది కాదు. అందుకే ఆయన తాను చేయాల్సిన పని చేసేసి.. మాటల్లో మాత్రం నో కామెంట్ మాత్రమే మాట్లాడుతూ పని పూర్తి చేస్తున్నారు. బుధవారం ఢల్లీికి వచ్చిన ఆయన.. రాష్ట్రపతి.. హోం మంత్రి తదితరులతో భేటీ అయిన ఆయన.. తన పర్యటన వెనుక సంచలనం ఏమీ లేదని.. రెగ్యులర్ ట్రిప్ అని చెప్పే ప్రయత్నం చేశారు.
విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు నో కామెంట్ అన్న ఆయన.. ఏ విషయానికి స్పందించేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేంద్రానికి నివేదిక ఇచ్చారా? అన్న ప్రశ్నకు నో కామెంట్ అన్న మాట చెప్పకుండా.. తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని చెప్పటం గమనార్హం. అన్నింటికి నో కామెంట్ చెప్పి.. ఫోన్ టాపింగ్ నివేదిక విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వటం ఏమిటో..?