నవ్యాంధ్ర నూతన రాజధానిలో నూతనంగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో నిన్న ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గవర్నర్ హోదాలో ఈఎస్ ఎల్ నరసింహన్ ఆదివారం రాత్రికే విజయవాడకు చేరుకున్నారు. నిన్న ఉదయమే గుంటూరు జిల్లా మంగళగిరిలోని నృసింహుడిని దర్శించుకున్న గవర్నర్... నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. నూతన అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు శాసనమండలి చైర్మన్ చక్రపాణి - అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ - సీఎం నారా చంద్రబాబునాయుడు ఘనంగానే స్వాగతం పలికారు. వెంట ఉండి మరీ ఆయనను అసెంబ్లీ భవనంలోకి తీసుకెళ్లారు.
ఆ తర్వాత తమ ప్రభుత్వ ప్రాధమ్యాలకు సంబంధించిన కాపీని చంద్రబాబు సర్కారు ఇవ్వగా, గవర్నర్ దానిని చదివేశారు. తన ప్రసంగ ప్రతిలో చాలా అంశాలున్న నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగాన్ని సుదీర్ఘంగానే కొనసాగించాల్సి వచ్చింది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడగా... గవర్నర్ అక్కడి నుంచి హైదరాబాదుకు బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. ఈ సమయంలో ఆయన బయటకు వస్తుండగా... ఆయనకు వీడ్కోలు పలికేందుకు చక్రపాణి - కోడెలతో పాటు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో యనమల రామకృష్ణుడు కూడా బయటకు వచ్చారు. అసెంబ్లీ భవనం నుంచి బయటకు వచ్చిన గవర్నర్ అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తన కారు ఎక్కబోయారు.
అయితే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆయన నిలబడగా... యనమల ఆయన దగ్గరగా వెళ్లారట. ఈ సందర్భంగా యనమల వైపు చూసిన గవర్నర్... హైదరాబాదు నుంచి వస్తే కనీసం టీ కూడా ఇవ్వకుండా పంపిస్తున్నారే. గంటకు పైగా ప్రసంగం చేయించారు. కనీసం టీ కూడా ఇవ్వరా అని అడిగారట. దీంతో షాక్ తిన్న యనమల.. అప్పటికప్పుడు సర్దుకుని... తనదైన చాతుర్యాన్ని ప్రదర్శించారట. ఆర్థిక లోటులో ఉన్నాం సార్.. అందుకే టీ కూడా ఇవ్వలేకపోయామని గవర్నర్ తో అన్నారట. ఆ తర్వాత గవర్నర్ కారెక్కి వెళ్లిపోగా... ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/