ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే గవర్నర్ నరసింహన్ కోమాలో ఉండటం ఏమిటి?ఇదంతా ఎప్పుడు జరిగిందన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. నరసింహన్ చెప్పింది ఇప్పటి విషయం కాదు.. 46 ఏళ్ల కిందట తన జీవితంలో జరిగింది చెప్పారు. తెలుగువారి కొత్త సంవత్సరమైన ఉగాదిని ఒకరోజు ముందుగా రాజ్ భవన్ లో ఉగాది వేడుకల్ని నిర్వహించారు. సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్నీ కార్యక్రమాల్ని మిస్ కాకుండా నిర్వహించటం నరసింహన్ కు అలవాటే. రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. విపక్ష నేతల్ని.. పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించిన గవర్నర్ కొత్త విషయాన్ని ప్రస్తావించారు. మొదటి ఉద్యోగం తాను ఈ నేల మీదనే చేశానని.. ఈ నేల తనకు పునర్జన్మ ఇచ్చిందన్నారు. 46 ఏళ్ల క్రితం జరిగిన ఒక దుర్ఘటనలోతాను తీవ్రంగా గాయపడి కర్నూలు ఆసుపత్రిలో చేరానని.. అప్పట్లో తాను చనిపోతానని అందరూ అనుకున్నారని.. ఐదు రోజులు కోమాలో ఉన్నానని.. ఉగాది రోజే కోలుకున్నానని.. అందుకే ఉగాదిని తాను ఎప్పటికీ మర్చిపోలేననంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఇరువురు గవర్నర్ ను పొగిడేసే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే ఇరువురు చంద్రుళ్ల మధ్యన గవర్నర్ నరసింహన్ కూర్చున్నారు. ఇద్దరు చంద్రుళ్ల కలయిక పలువురి దృష్టిని ఆకర్షించింది. జలుబు కారణంగా కార్యక్రమంలో త్వరగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కాసేపటికే చంద్రబాబు వెళ్లిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/