హైద‌రాబాద్‌లో పోలీస్ స్టేష‌న్ పెట్టుకోవ‌చ్చా?

Update: 2015-06-22 13:38 GMT
ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్న ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో సోమ‌వారం సాయంత్రం అటార్నీ జ‌న‌ర‌ల్ చెప్పార‌ని చెబుతున్న మౌఖిక స‌ల‌హా రాజ‌కీయ క‌ల‌క‌లం రేపుతోంది. ఓటుకు నోటు కేసును ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప‌ర్య‌వేక్షించొచ్చ‌ని చెప్ప‌టంతో పాటు.. సెక్ష‌న్ 8 ప్ర‌కారం.. హైద‌రాబాద్‌లో ఇరురాష్ట్రాల పోలీసుల‌కు అధికారం ఉంటుంద‌న్న మాట రాజ‌కీయ అల‌జ‌డి సృష్టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
హైద‌రాబాద్‌లో ఇరు రాష్ట్రాల పోలీసుల‌కు స‌మాన అధికారాలు ఉంటాయ‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ మౌఖికంగా చెప్పిన మీద‌ట‌.. హైద‌రాబాద్‌లో ఏపీ స‌ర్కారు పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు చేసుకునే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అటార్నీ జ‌న‌ర‌ల్ మాట‌ల్ని విశ్లేషిస్తున్న న్యాయ నిపుణులు.. హైద‌రాబాద్ ఇరు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంటున్న నేప‌థ్యంలో.. ఏపీ పోలీసులు పోలీస్ స్టేష‌న్ పెట్టుకునే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే.. ఓటుకు నోటు వ్య‌వ‌హారంతో ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ పైచేయిగా ఉంద‌న్న వాద‌న పూర్తిగా మారిపోయే వీలుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News