వివాదాలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనకేమాత్రం సంబంధం లేని విషయంపై ఆయన చొరవ తీసుకొని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ కలకలాన్ని రేపటమే కాదు.. సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తొలి నుంచి చిన్నమ్మ శశికళ వైపు నిలిచిన స్వామి.. తాజాగా సొంత పార్టీ నేతలకు జుట్టు పట్టుకొనేలా వ్యవహరిస్తున్నారు.
నిన్నటికి నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన స్వామి..చిన్నమ్మను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించకుండా అడ్డుపుడుతన్నట్లుగా ఫిర్యాదు చేసిన స్వామి తీరుతో కమలనాథుల్లో కొత్త కలకలంరేగుతోంది. ఎప్పుడేం మాట్లాడతారో తెలియని ఆయన తీరుతో మహా ఇబ్బందిగా మారిందన్న మాట వారు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి గవర్నర్ విద్యాసాగర్ ను పన్నీర్.. చిన్నమ్మలు భేటీ అయ్యాక.. వారికి గవర్నర్ ఏం చెప్పారన్న అంశంపై స్వామి వరుస ట్వీట్లు చేయటం ఆసక్తికరంగా మారటమేకాదు.. సంచలనం సృష్టించేలా చేసింది. గవర్నర్ ను కలిసిన పన్నీర్ సెల్వంకు ఆయన ఐదు రోజులు సమయం ఇచ్చారని.. ఈ లోపు బల నిరూపణకు సిద్ధం కావాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు.
పన్నీర్ కు ఐదు రోజుల సమయం ఇస్తే అక్రమాలకు లాకులు ఎత్తేసినట్లేనని ఆయన ట్వీట్లు చేయటం తమిళనాట సరికొత్త చర్చనీయాంశంగా మారింది. మరి.. స్వామి చేసిన ట్వీట్లకు తగ్గట్లే.. పన్నీర్ కు గవర్నర్ టైమిచ్చారా? అన్న విషయంపై స్పష్టత రావాలంటే.. మరికాస్త వెయిట్ చేస్తే సరిపోతుంది.ఒకవేళ కానీ స్వామి ట్వీట్లే నిజమైతే మాత్రం.. అదో సంచలనంగా మారుతుందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/