ఎంఎల్సీ ఫైలుపై స్టడీ చేస్తున్నారట

Update: 2021-09-08 11:54 GMT
టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని ఎంఎల్సీగా నామినేట్ చేస్తు రాష్ట్రప్రభుత్వం పంపిన ఫైలును తాను స్టడీ చేస్తున్నట్లు గవర్నర్ తమిళిసై చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి హఠాత్తుగా టీఆర్ఎస్ తీర్ధంపుచ్చుకున్నారు. ఈనేత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరగానే కేసీయార్ వారం రోజుల గ్యాప్ లో గవర్నర్ కోటాలో ఎంఎల్సీగా నామినేట్ చేశారు. కౌశిక్ ను గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన మంత్రివర్గం తీర్మానం గవర్నర్ కు చేరి కూడా చాలా రోజులైంది.

నిజానికి ప్రభుత్వం నుండి సిఫారసు రాగానే గవర్నర్ వెంటనే ఓకే చేసేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరిపేర్లను సిఫారసు చేసిందనే విషయాన్ని ఏ గవర్నర్ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ తమిళిసై ఏ కారణం చేతనో డిఫరెంటుగా ఆలోచించారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఫైలును తన వద్దే అట్టే పెట్టేసుకున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి వివరణ గవర్నర్ కోరారో కూడా ఎవరికీ తెలీటంలేదు. కారణం ఏదైనా కానీండి ఇఫ్పటికీ గవర్నర్ అయితే సదరు ఫైలును క్లియర్ చేయలేదు.

గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ ఫైలు విషయాన్ని ప్రస్తావించినపుడు తానింకా కౌశిక్ రెడ్డి ఫైలును స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. కౌశిక్ ఫైలుకు తాను ఇంకా ఓకే చెప్పలేదని తన దగ్గరే పెండింగ్ లో ఉందని గవర్నర్ చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నిక వరకు ఆపుతారా ? అన్న ప్రశ్నకు గవర్నర్ స్పందిస్తు 'మీరేమన్నా ఊహించుకోండి మీ ఇష్టం' అన్నారు.
Tags:    

Similar News