ఖమ్మం సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీజేపీకి గట్టిగానే తగిలాయి. కిషన్ రెడ్డి లాంటి కేంద్రమంత్రులు స్పందించారు. బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై నుంచి కౌంటర్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ను పూర్తిగా అవమానించారని తమిళిసై అభిప్రాయపడ్డారు. పరీక్షల సమయంలో ఎదురయ్య భయాన్ని జయించేందేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పేరుతో పుస్తకం రాశారు. రాజ్ భవన్ లో ఆమె దీన్ని ఆవిష్కరించి మాట్లాడారు.కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ ను ఎలా అవమానిస్తారని తమిళి సై ప్రశ్నించారు.ప్రొటోకాల్ కు సంబంధించి తాను పలు మార్లు మాట్లాడినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. కేసీఆర్ స్పందించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని గవర్నర్ వెల్లడించారు.
ఖమ్మం వేదికగా తొలిసారిగా నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పనరయి విజయ్, సీబీఐ నేత డి. రాజా, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరు కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. కేరళ సీఎం పినరయి విజయ్ తన సంపూర్ణ మద్దతును కేసీఆర్ కు తెలియజేశారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు. కేంద్రం వైఖరితో రాజ్యాంగాన్ని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం సభ దేశానికి దిక్సూచీ లాంటిదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాచరికాన్ని తరిమికొట్టారని.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థను కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. తమ రాజకీయ అవసరాలకు వీరిని ఉపయోగించుకుంటోందంటూ విమర్శలు చేశారు. తాజాగా ఈ విమర్శలను గవర్నర్ తమిళిసై ఖండించారు. రాజ్యాంగబద్దమైన గవర్నర్ వ్యవస్థపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
అయితే ఇదే రాజ్యాంగబద్దంగా ఉన్న గవర్నర్లు బీజేపీ చెప్పినట్టు చేయడం.. ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టేలా చేయడం ఏంటని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ బిల్లులన్నింటిని పెండింగ్ లో పెడుతున్న గవర్నర్ తీరుకు విసిగి వేసారే ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పక తప్పదు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ గవర్నర్ ఇలానే ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.