మానవత్వం చాటుకున్న గవర్నర్ తమిళిసై !

Update: 2021-04-01 08:04 GMT
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెద్దమనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న యువకుడిని గవర్నర్ తన కాన్వాయ్‌ లో ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలు నిలిపారు.  చెన్నై శివారులోని ఈ ఘటన చోటు చేసుకుంది. తండలంలో నిర్మించిన మురుగన్ ఆలయంలో నిర్వహించతలపెట్టిన ప్రథమ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు తమిళిసై బయలుదేరారు.

అయితే మురుగన్ ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి సృహ లేకుండా పడి ఉన్న ఓ యువకుడు ఆమె దృష్టిలో పడ్డాడు. దీంతో ఆమె వెంటనే తన కాన్వాయ్‌ ను ఆపారు. తన కాన్వాయ్ ‌లోని అంబులెన్స్‌ లో రోడ్డు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులకు ఫోన్ చేసి యువకుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో తమిళిసై సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డుపై గాయాల పాలైన యువకుడ్ని సకాలంలో ఆస్పత్రికి తరలించే అతని ప్రాణాలు కాపాడారు. దీంతో తమిళిసై మంచి మనసుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News