రాజ్‌భవన్. రాష్ట్ర తొలి పౌరుడు.. కొలువుదీరిన భవనం. ఈ భవనాల్లోని పెద్దలకు రాజ్యాంగబద్ధంగా అనేక కీలక అధికారాలు ఉంటాయి. అయితే, వీటిని తమకు ఇష్టానుసారంగా మలుచుకుని తమకు నచ్చిన విధంగా వ్యవహరించారనే పేరు గతంలో చాలా మంది గవర్నర్లు తెచ్చుకున్నారు. పుదుచ్చేరి గవర్నర్ మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తీరు నిన్న మొన్నటి వరకు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు కర్ణాటక గవర్నర్ కూడా కట్టుతప్పుతున్నారా? అనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా రు. 400 కోట్ల కుంభ కోణానికి సంబంధించి నిందితుడిగా ఉన్న రెబల్ ఎమ్మెల్యేను కాపాడాలని ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలంటూ నేరుగా ఆయనే విచారణ అధికారులకు లేఖ రాసిన విషయం వెలుగు చూసింది.
దీంతో ఈ పరిణామం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటక గవర్నర్ గా ఉన్న వజూభాయ్ వాలా.. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు తనవంతు గా చేసిన కృషిని మరిచిపోలేం. అయితే, ఇప్పుడు స్వయంగా గవర్నరే మరో వివాదంలో చిక్కుకున్నారని అంటున్నారు పరిశీలకులు. ఐఎంఏ చీటింగ్ స్కాం కు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో విచారణ జరుగుతోంది. దీనితో సంబంధాలు ఉన్నాయని భావిస్తూ.. మన్సూర్ ఖాన్ ను అధికారులు విచారిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఈ స్కాంలో కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని శివాజీనగర్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో జులై 16వ తేదీ రాత్రి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శివాజీనగర్ రెబల్ ఎమ్మెల్యే (కాంగ్రెస్)ను విచారణ పేరుతో డీసీపీ గిరీష్ ఆధ్వర్యంలోని అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలిసిన మరుక్షణమే గవర్నర్ వాజుభాయ్ రంగంలోకి దిగిపోయారని తెలుస్తోంది. మరునాడే ఆయన ఎస్ ఐటీ అధికారి రవికాంత్ గౌడకు లేఖ రాసినట్టు సమాచారం.
అవసరమైన మేరకు రోషన్‌కు సానుకూల వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని దానిలో గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది. ఇక, ఐఎంఏ స్కాంకు సంబంధించి రూ. 400 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ ను అధికారులు ఇంత వరకూ పూర్తి స్థాయిలో విచారణ చెయ్యలేదు - అరెస్టు చెయ్యలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్ర ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన సూచనల కారణంగా రోషన్ పై చర్యలకు పోలీసులు దూరంగా ఉన్నారని అంటున్నారు.