ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది చూసుకోకుండా మనసుకు తోచింది పోస్టు రూపంలో పెట్టేయటం.. అవి కాస్తా వైరల్ గా మారిపోవటం అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఒక కేంద్రమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. సుష్మా లాంటి సీనియర్ నేతను ఒక బుల్లి రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపిక చేస్తారని ఎలా అంచనా వేస్తారు? తక్కువలో తక్కువ ఉప రాష్ట్రపతి పదవి కంటే తక్కువ పదవి తీసుకోవటానికి ఇష్టపడని ఆమె.. గవర్నర్ గిరిని ఎందుకు తీసుకుంటారు.
ఈ చిన్న లాజిక్ ను మిస్ అయి.. ఆమెను ఏపీ గవర్నర్ గా నియమించారని.. అభినందనలు అంటూ పోస్ట్ చేయటం.. తర్వాత నాలుక కర్చుకొని డిలీట్ చేశారు. ఇలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారే ఇలా వ్యవహరిస్తే మామూలు వారి సంగతేంటి?
తాజాగా గవర్నర్లు పలువురు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. ఇలా కలుస్తున్న వేళ.. గవర్నర్ పదవుల్లో మార్పు కోసం కసరత్తు జరుగుతోందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంలోనూ బుర్ర.. బుద్ది ఉన్నట్లుగా కనిపించదు. ఎందుకంటే.. గవర్నర్లను పదవి నుంచి తప్పించాలన్న ఆలోచన ఉంటే.. హోంశాఖామంత్రిగా ఉన్న అమిత్ షా వారికి టైమిచ్చి.. వారితో అంతసేపు ఎందుకు మాట్లాడతారు? అన్న లాజిక్ తో ఆలోచించి ఉంటే కొత్త గవర్నర్ల ఏర్పాటు అంశంపై బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేశారని చెప్పక తప్పదు.
ఎప్పుడైనా సరే కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి వద్దకు మర్యాదపూర్వకంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు కలవటం.. ఆయనకు రాష్ట్రానికి సంబంధించిన అంశాల్ని బ్రీఫ్ చేయటం మామూలే అదే రీతిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సైతం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. దానికి చాటలు కట్టేసి.. ఏదేదో జరిగినట్లుగా వార్తలు తెర మీదకు రావటం తెలిసిందే.
మొన్న నరసింహన్ తో పాటు కొందరు గవర్నర్లు కలవగా.. తాజాగా మరో ఐదు రాష్ట్రాల గవర్నర్లు అమిత్ షాతో భేటీ అయ్యారు. షాను కలిసి వారిలో పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ.. తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్.. జార్ఖండ్ గవర్నర్ ద్రైపది ముర్ము.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా తదితరులు భేటీ అయ్యారు. కొత్తగా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని తమకు తాము పరిచయం చేసుకోవటం అలవాటు. అందులో భాగంగానే తాజా భేటీలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.