త‌స్స‌దియ్యా... జీతాలంటే ఇలా పెర‌గాలి

Update: 2017-03-27 05:48 GMT
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగటం కొత్త విషయం కాదు. ప్రభుత్వ..ప్రైవేటు ఉద్యోగులకు మధ్యనున్నవ్యత్యాసం ఏమిటంటే.. పాలకుల మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా జీతాల పెంచక తప్పని పరిస్థితి తీసుకురావొచ్చు. కానీ.. ప్రైవేటుఉద్యోగుల పరిస్థితి ఆ తీరులో ఉండదు. మరింత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ప్రైవేటు ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నదేమీ లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకక్రమపద్ధతిలో పెరిగిపోతుంటే.. అదే సమయంలో ప్రైవేటు ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగని దుస్థితి.

మరోవైపు..అన్నిఖర్చులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. వాటికి డబ్బులు ఖర్చు చేయలేక.. పన్నుపోటు నుంచి బయట పడలేక సామాన్యుడు పడుతున్న అవస్థలు అన్నిఇన్ని కావు. ఈ కారణంతోనే..సమాజంలో కొందరి జీతాలు అంతకంతకూ పెరిగిపోతుంటే..మరికొందరు జీతాలు.. జీవితాల్లో ఏ మాత్రం మార్పు రాని పరిస్థితి.

తాజాగా సుప్రీం.. హైకోర్టు న్యాయమూర్తుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తున్న వైనాన్ని చూస్తే.. కాసింత అవాక్కు అవ్వాల్సిందే. కలలో కూడా ఊహించని రీతిలో జీతాల పెంపు దిశగా ఆలోచిస్తోంది. నిజానికి న్యాయమూర్తుల జీతాల్ని పెంచాల్సిన అవశ్యకత ఉంది. ఎందుకంటే.. మారిన కాలానికి తగ్గట్లుగా జడ్జిల జీతాలు లేవన్నది నిజం. ఈ కారణంతోనే కావొచ్చు.. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తులు.. హైకోర్టు ప్రధానన్యాయమూర్తులు సహా న్యాయమూర్తుల వేతనాల్ని 200 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లుగా తేలుస్తోంది. ఒక్కసారిగా వేతనాల్ని ఇంతభారీగా పెంచాలన్నప్రతిపాదనపై కేంద్రం పాజిటివ్ గా ఉన్నట్లుగా సమాచారం.

తాజాగా పెంచాలనుకున్న జీతాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రదానన్యాయమూర్తికి రూ.2.5లక్షలు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ.2.5లక్షలు.. జడ్జిలకు రూ.2.25లక్షల జీతాల్ని ఇవ్వాలని నిర్ణయించారు. తాజా పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే..న్యాయవాదవర్గాలు సంతృప్తికి గురి కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఈ దెబ్బ‌తో మోడీ సర్కారు మీద జ‌డ్జిల‌కు సాఫ్ట్ కార్న‌ర్ పెర‌గ‌కుండా ఉంటుందా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News