ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పక్కలో బల్లెంలాగా ఉండే హిందుత్వ వేదిక శివసేన తాజాగా ఆయనపై ఘాటు విమర్శలు చేసింది. మోడీ ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ ఆయన విధానాలే ఆయనకు శాపంగా మారుతున్నాయని ఎద్దేవా చేసింది. శివసేన తరఫున ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో ఈ మేరకు ఫైర్ అయింది.
జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ విషయంలో మోడీ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని సామ్నా సంపాదకీయం పేర్కొంది.అందుకే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగిడుతున్న కన్నయ్య కుమార్ 'మోడీని ఓఎల్ ఎక్స్ లో అమ్మేస్తాం' అంటూ వ్యాఖ్యానించారని దెప్పిపొడిచింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వేవేల హామీల అమలులో మోడీ వైఫల్యం చెందడం వల్లే ఇలాంటి వారు కూడా ప్రధానమంత్రిని కామెంట్ చేసే స్థాయికి చేరిపోయారని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది.
రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని కన్నయ్య లాంటి వారు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోడీని అమ్మేస్తామనే స్థాయికి ఎందుకు చేరారో మోడీ సహా బీజేపీ అంతర్మథనం చేసుకోవాలని సూచించింది. లేకపోతే భవిష్యత్ పరిణామాలు ఇబ్బందికరంగా ఉండటం ఖాయమని హెచ్చరించింది.