నారాయణ.. శ్రీచైతన్యలకు షాకిచ్చిన హైకోర్టు?

Update: 2019-12-20 05:28 GMT
నిబంధనల్ని పెద్దగా పట్టించుకోకుండా.. తాము అనుకున్నదే రూల్ అన్నట్లుగా వ్యవహరిస్తాయన్న ఆరోపణలు.. విమర్శలు శ్రీచైతన్య.. నారాయణ మీద తరచూ వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ రెండు ప్రముఖ విద్యా సంస్థలకు షాకిచ్చేలా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఆదేశాలుజారీ చేసింది.

ఈ రెండు సంస్థలకు చెందిన కాలేజీల్లో నిబంధనల్ని పట్టించుకోకుండా తమ విద్యా సంస్థల్ని నిర్వహిస్తుంటారంటూ మేడిపల్లికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాలేజీల్లో విద్యార్థులకు కల్పించాల్సిన కనీస సదుపాయాలు ఏవీ కూడా సదరు విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయరని ఆరోపించారు.

ప్రభుత్వ నిబంధనల్ని ఈ రెండు విద్యా సంస్థలకు చెందిన కాలేజీల్లో అమలు చేయరని పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టుకు పిటిషన్ దారు తన వద్ద ఉన్న ఆధారాల్ని చూపించారు. లోతైన విచారణ జరిపి.. నాలుగు వారాల్లో పూర్తి నివేదికను అందజేయాలని ఇంటర్ బోర్డును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.తాజా ఆదేశాలు ఈ రెండు ప్రముఖ విద్యాసంస్థలకు షాకింగ్ గా మారతాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News