దేశ ప్రధాని మోడీ స్వయంగా వచ్చి ఏపీ కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. తల్లిని చంపేసి.. బిడ్డను బతికించారంటూ 2014 సార్వత్రిక ఎన్నికల వేళ మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త రాజధానికి ముఖ్య అతిధిగా వస్తున్న ఆయన మీద ఆంద్రా ప్రాంత ప్రజలు భారీగానే ఆశలు పెట్టుకుంటే.. పార్లమెంటు నుంచి తెచ్చిన మట్టి.. గంగా నీళ్లను రెండు చెంబుల్లో తీసుకురావటం ద్వారా అందరికి షాకిచ్చారు. ఏపీ నిర్మించే కొత్త రాజధానికి తానిచ్చే బహుమతి ఇదేనంటూ అందరిని అవాక్కు అయ్యేలా చేశారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగానే షాకిచ్చిన మోడీ సర్కారు..తాజాగా విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్ లో అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలు ఉంటే.. ఏపీ రాజధాని నగరమైన అమరావతి లేకపోవటం షాకింగ్ గా మారింది. ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది.
దాదాపు 33 వేల ఎకరాల్ని సమీకరించిన చంద్రబాబు సర్కారు రాజధానిగా చెప్పే ప్రాంతంలో తాత్కాలిక సచివాలయాన్ని.. అసెంబ్లీతో పాటు కొన్ని కట్టడాల్ని నిర్మించింది. అయితే.. ఇవన్నీ తాత్కాలికం కావటం.. శాశ్విత కట్టటం ఒక్కటి కూడా లేకపోవటంతో గుర్తింపు దక్కలేదా? అన్నది ప్రశ్నగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సచివాలయం.. అసెంబ్లీ భవనాలున్న ప్రాంతాలకు గతంలో ఉన్న ఊళ్ల పేరుతోనే పోస్టల్ పిన్ కోడ్ వాడుతున్న వేళ.. అమరావతి అన్నది పేరులోనే తప్పించి.. సాంకేతికంగా దాన్నో పట్టణంగా గుర్తింపు లేదన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ ఐదేళ్ల పాలనా సమయంలో అమరావతి నగరాన్ని నిర్మించే విషయంలో బాబు సర్కారు అమలు చేసిన విధానం కూడా తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఐదారు కట్టడాలు మించి.. మరే నిర్మాణం లేకపోవటం.. భూములు తప్పించి మరేమీ లేకపోవటం కూడా అమరావతి గుర్తింపు దక్కకపోవటానికి కారణంగా చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా రాష్ట్ర రాజధాని విషయంలో అమరావతిని కొనసాగించాలా? మరేదైనా నిర్ణయం తీసుకోవాలా? అన్న అంశంపైన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. అనవసరమైన గందరగోళానికి తావివ్వకుండా ఉండటానికి వీలుగా కేంద్రం రాజధాని నగరాన్ని పేర్కొనలేదన్న మాట వినిపిస్తోంది. రాజధాని నగరంగా ఏర్పాటు చేసినప్పుడు.. సాంకేతికంగా దానికి ఆ గుర్తింపు లభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయని చంద్రబాబు ఈ మొత్తం ఎపిసోడ్ లో బాధ్యుడిగా చెప్పక తప్పదు.