అత్యాచారం కేసులో అడ్డంగా బుక్కయి జైలుకెళ్లిన డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ కు మరో భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రముఖులకు - ముఖ్యమైన వ్యక్తులకు ఎయిర్ పోర్టు లాంజ్ ల్లో ప్రత్యేక ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. దీంతో భవిష్యత్తులో ఆయనకు విమానాశ్రయాల్లో ఆయనకు ఏమీ ప్రత్యేక ప్రవేశమేమీ ఉండదన్నమాట.
దీంతోపాటు ఇండియన్ ఫిల్మ్ - టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్ టీడీఏ) కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం ఆయన గట్టి దెబ్బే. గుర్మీత్ రాంరహీం సింగ్ 2015లో ఎంఎస్ జీ: దిమెస్సెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ఇకపై ఆయనతో ఎలాంటి సినిమాలు తీయరాదని ఐఎంపీఏఏ - ఐఎఫ్ టీడీఏ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు జడ్ కేటగిరీ భద్రతను ఇటీవల రద్దు చేసేశారు. గుర్మీత్ కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్ ల్లోకి ఉన్న ప్రవేశానుమతి రద్దు నిన్నటి నుంచే అమల్లోకి వస్తుంది.
ఈ విమానాశ్రయ ప్రత్యేక అనుమతి జాబితాలో గుర్మీత్ పేరు ఇంతకుముందు 51వ స్థానంలో ఉండేది. దాన్ని రద్దు చేస్తున్నట్లుగా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం దేశంలోని అన్ని విమానాశ్రయాలకూ పంపించారు. దీంతో ఇంతకాలం దేశంలో సకల మర్యాదలూ అనుభవించిన బాబా ఇప్పుడుఅన్నీ కోల్పోయి - పరువు పోగొట్టుకుని జైలు పక్షిగా మిగిలిపోవాల్సివచ్చింది.