కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణకు కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందా ? వచ్చిందనే అంటున్నారు సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డి. కరోనా వైరస్ తీవ్రతకు జనాలు అల్లాడిపోతున్నారు. రోగ నివారణకు సరైన మందులు లేక, టీకాలు అందరికీ అందక, ఆక్సిజన్ అందక, సరఫరా సరిపోక వందలాది రోగులు చనిపోతున్నారు.
ఇలాంటి నేపధ్యంలోనే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బొరిగి ఆనందయ్య ఇస్తున్న మందు జనాల్లో, రోగుల్లో ఆత్మస్ధైర్యం ఇస్తోందని ప్రచారం మొదలైంది. మొదట్లో పదుల సంఖ్యలో మాత్రమే మందులు తీసుకుంటున్న జనాలు ఇపుడు వేలసంఖ్యలో వస్తున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకే కాదు వైరస్ సోకకుండా కూడా ముందుజాగ్రత్తగా ఆనందయ్య మందులు ఇస్తున్నారు.
ఆయుర్వేద మందుపంపిణీ విషయం తెలుసుకున్న ప్రభుత్వాధికారులు వెంటనే అక్కడ వాలిపోయారు. ఆయుష్ విభాగం ఉన్నతాధికారులు ఆనందయ్యతో మాట్లాడి మందుల పంపిణీని నిలిపేయించారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుల శాంపుల్సును ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ లో మందుల పరీక్షించిన తర్వాత వాడకంలో ఎలాంటి నష్టంలేదని తేల్చారు. మందుల వాడకం హానికరం కాదని మందుల తయారీలో వాడుతున్న దినుసులన్నీ ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని కూడా సర్టిఫికేట్ ఇచ్చారు.
మొత్తానికి వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ఆనందయ్య కుటుంబం కరోనా వైరస్ విరుగుడుకు ఇస్తున్న మందులకు ఆధరణ పెరుగుతోంది. డాక్టర్ ఇస్తున్న మందులు జనాల్లో, రోగుల్లో బాగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతోందని జనాలు చెబుతున్నారు. కరోనా సోకిన వారు మూడు రోజులు, మామూలు జనాలు ఒకరోజు వాడితే చాలని డాక్టర్ చెబుతున్నారు. మొత్తానికి ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేదం వైద్యానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం సంతోషమే.