పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా... గ్రామాల్లో కోలాహలం

Update: 2019-11-30 07:00 GMT
రాష్ట్రంలో ఇంకా సార్వత్రిక ఎన్నికల వేడే తగ్గలేదు అప్పుడే ..రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికలకి సిద్ధమౌతోంది. త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మొన్నటి ఎన్నికలు వేరు .. జరగబోయే ఎన్నికలు వేరు. సార్వత్రిక ఎన్నికలకి ..స్థానిక ఎన్నికలకి మధ్య తేడా చాలా ఉంటుంది. ఈ ఎన్నికలలో ఒకే గ్రామంలో ఉండే వారే పోటీ పడుతుండటంతో తీవ్రమైన ఉద్రిక్తతలకి దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుండటం ..దాదాపు ఆరున్నర ఏళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది.

ఈ సారి మనవూరి  ప్రెసిడెంట్‌గా ఎవరు పోటీ చేయబోతున్నారు..ఎంపీటీసీకి పోటీ చేసేది ఆయనేనా అనే ముచ్చట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నిర్వహించబోయే మొదటి ఎన్నికలు ఇవే కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఎక్కువగానే దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల లో ఉపయోగించిన ఓటర్ల లిస్ట్ నే ..ఈ స్థానిక ఎన్నికలకి కూడా ఉపయోగించనున్నారు. సమయం తక్కువగా ఉండటం తో కొత్తగా ఓటు వేద్దాం అని అనుకునే వారికీ ఈ సారి నిరాశ తప్పదు.

ఇక ఈ స్థానిక సంస్థల  ఎన్నికలలో భాగంగా ..ప్రభుత్వం  డిసెంబరు 15నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రంగు పేపర్ ని వార్డు మెంబర్‌ కి , గులాబీ రంగు పేపర్ ని సర్పంచ్‌ కి కేటాయించారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కీలక అంశం అయిన రిజర్వేషన్స్ పై ఒక నిర్ణయం తీసుకుంటే ...ఎన్నికల హుంగామ పూర్తిగా మొదలైనట్టే ..దీనిపై కసరత్తులు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం .. జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు చేయబోతుంది. ఆలా ప్రభుత్వం  రిజర్వేషన్ల జాభితా ప్రకటించిన మరుసటి రోజు నుండే  ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. ఇకపోతే  సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో చాలా సందడిగా వుంటుంది. కానీ, ఈసారి పండుగ కంటే ముందే ఎన్నికల హడావిడి మొదలు కాబోతుండటంతో ..పండుగ కంటే   ముందుగానే గ్రామాలు మరింత సందడిగా మారబోతున్నాయి.
Tags:    

Similar News