కరోనాతో అందరూ భయంతో వణికిపోతుంటే ఈ విద్యార్థులు ‘జై కరోనా’ బతికించావ్ అని పండుగ చేసుకున్నారు. ఆడి పాడి సంబరాలు చేసుకున్నారు. డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.
ఢిల్లీలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ ఒక మహిళ కూడా చనిపోయింది. దీంతో ప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని పరీక్షలు వాయిదా వేసి పాఠశాలలు, కళాశాలలకు సెలువులు ఇచ్చేసింది. క్లాసులను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వం ఆదేశాలతో ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల పరీక్షలు రద్దు అయ్యాయి. ఇక క్యాంపస్ లో ఎటువంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని వీసీ ఆదేశించారు. పరీక్షలు వాయిదా పడి సెలవులు దొరకడం.. దీనికి కరోనా వైరస్ కారణం కావడంతో ఆనందం పట్టలేక విద్యార్థులు గంతులేశారు. తమకు మంచి రిలీఫ్ ఇచ్చిన కరోనాను ‘జై కరోనా’ అంటూ నినదిస్తూ డ్యాన్సులు చేశారు.
ఐఐటీ ఢిల్లీ కరకోరమ్ హాస్టల్ లో కరోనా కారణంగా సెలవులు దొరకడంతో విద్యార్థులు పండుగ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.