మోడి సర్కారు విజయం సాధించింది. తాను అనుకున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.. సింఫుల్ గా చెప్పాలంటే ‘జీఎస్టీ’ బిల్లు (సవరణ)కు రాజ్యసభ ఆమోదం పలికింది. ఈ బిల్లుపై బుధవారం రాజ్యసభలో దాదాపు ఏడు గంటలు పైగా చర్చించిన అనంతరం.. ఆరు సవరణలతో ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. అయితే.. ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తమిళనాడు అధికారపక్షం ఎంపీలు.. వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇక.. సభలో మిగిలిన 203 మంది సభ్యులందరూ ఈ బిల్లుకు తమ ఆమోదాన్ని తెలిపారు. దీంతో.. ఒక్క వ్యతిరేక ఓటు (ఓటింగ్ సందర్భంగా సభలో ఉన్న సభ్యులు)కూడా పడకుండానే జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసినట్లైంది.
జీఎస్టీ బిల్లుకు సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభ ముందు ఉంచారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మొదలైన జీఎస్టీ బిల్లు.. రాత్రి 9 గంటల తర్వాత వరకూ సుదీర్ఘంగా సాగింది. ఈ బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్న కాంగ్రెస్.. పన్ను గరిష్ఠంగా 18 శాతం ఉండాలని పట్టుబట్టటంతో పాటు.. బిల్లును ద్రవ్య బిల్లుగా కాకుండా ఆర్థిక బిల్లుగా సభ ముందు ఉంచాలంటూ పట్టుబట్టింది.
కాంగ్రెస్ కోరినట్లు గరిష్ఠంగా 18 శాతం అన్నఅంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వనప్పటికీ.. పన్నుల రేట్లను వీలైనంత తక్కువగా ఉండేటట్లు ప్రయత్నిస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు. పన్ను రేటును జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని.. ఈ కౌన్సిల్ లో 29 రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారని.. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవచ్చన్న మాటతో కాంగ్రెస్ వాదన వెనక్కి వెళ్లింది.
జీఎస్టీపై క్లాజుల వారీగా ఓటింగ్ నిర్వహించిన అనంతరం.. బిల్లు ఆమోదం పొందినట్లుగా పేర్కొంటూ సభను బుధవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో వాయిదా వేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందటంతో ఒకే దేశం.. ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చినట్లైంది. తాజా బిల్లును మళ్లీ లోక్ సభలో ఆమోదానికి తీసుకెళ్లనున్నారు. రాజ్యసభలో సవరణలు చేసిన నేపథ్యంలో.. లోక్ సభ ఆమోదం తప్పనిసరి అవుతుంది. జీఎస్టీ బిల్లు ఆమోదంతో దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం అందుబాటులోకి రావటంతో పాటు.. పన్ను ఎగవేతకు చెక్ పెట్టే వీలుంది. గరిష్ఠ పన్ను 18 శాతంగా ఉండాలని కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. ఈ రేటు 12.5 శాతానికి మించకూడదని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు వాదిస్తున్నారు. అయితే.. పన్ను రేటు ఎంత ఉండాలన్న విషయం జీఎస్టీ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత హడావుడి జరుగుతున్న జీఎస్టీ బిల్లు అమల్లోకి రావటానికి మరో ఏడాది సమయం పట్టనుంది. బిల్లు ఆమోదం తర్వాత.. అన్నిప్రక్రియలను పూర్తి చేసుకొని.. చట్టంగా అమల్లోకి రావటానికి ఈ సమయం తప్పనిసరిగా చెబుతున్నారు.