జీఎస్టీ ఎఫెక్ట్ః మీ ఫోన్ బిల్లు మోగిపోతుంది

Update: 2017-06-30 17:34 GMT
స‌ర్వం టెక్ మ‌యం అయిపోయిన‌ ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమై పోయాయి. అయితే.. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత వీటికి చెల్లిస్తున్న బిల్లులు మరింత బరువెక్కనున్నాయి. ప్రస్తుతం మొబైల్, ఇంటర్నెట్ బిల్లులపై 15శాతం పన్ను విధిస్తుండగా, అది 18శాతానికి పెరిగింది. అంటే.. మీరు మీ మొబైల్ ఫోన్‌కు చేసుకునే రీచార్జ్ ఖర్చు మూడు శాతం పెరుగనుంది.

ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే..ఉదాహరణకు మీ మొబైల్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు వెయ్యి చొప్పున రెండు వేలు ఉంటే.. ఇకపై 2,060 కట్టాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ వినియోగదారులైతే టాక్‌టైమ్ తగ్గిపోతుంది. నిత్యావసరంగా మారిన టెలికం సర్వీసులను 18శాతం శ్లాబులో చేర్చడంపై పరిశ్రమవర్గాలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. టెలికమ్యూనికేషన్లను అత్యవసర సర్వీసులుగా (ఎస్మా) పరిగణించాలని వాదిస్తున్నాయి. అదే సమయంలో కేబుల్ టీవీలు, డీటీహెచ్ సర్వీసుల చార్జీలు తగ్గే అవకాశం ఉంది.

మ‌రోవైపు ఈ రోజు అర్ధ‌రాత్రి త‌ర్వాత ఇలాంటి ప‌రిణామాలు జ‌ర‌గ‌నున్నాయి. ఏం జ‌రగనుందో కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు ఇవి...

డిన్న‌ర్ కు వెళితే

మీరు ఒక‌వేళ ఈ రోజు రాత్రి డిన్న‌ర్ కు వెళితే కనుక అర్ధ‌రాత్రి కి ముందే మీ బిల్లు పే చేయండి. ఎందుకంటే.. అర్ధ‌రాత్రి 12 దాటిందంటే మీ బిల్లు జీఎస్టీ ప్ర‌కారం చెల్లించాల్సుంటుంది. ఇప్పుడు ఉన్న‌ సర్వీస్ టాక్స్, వ్యాట్ బ‌దులు జీఎస్టీ క‌ట్టాలి. నాన్ ఏసీ హోట‌ల్ అయితే జీఎస్టీ 12 శాతం ఉంటుంది. అదే.. ఏసీ హోట‌ల్ అయితే మీరు 18 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే.

క్యాబ్ బుక్ చేస్తే

ఒక‌వేళ అర్ధ‌రాత్రి కి ముందే క్యాబ్ ను బుక్ చేసినా.. అర్ధ‌రాత్రి త‌ర్వాత ప్ర‌యాణం పూర్త‌యితే... జీఎస్టీ ప్ర‌కారమే డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

హోట‌ల్ లో స్టే చేస్తే

జూన్ 30 కంటే ముందే హోట‌ల్ బుక్ చేసి.. జూన్ 30 అర్ధ‌రాత్రి త‌ర్వాత ఎప్పుడైనా హోట‌ల్ వెకేట్ చేస్తే జీఎస్టీ ప్ర‌కార‌మే ట్యాక్స్ క‌ట్టాలి. అయితే.. మొత్తం డ‌బ్బులు జూన్ 30 అర్ధ‌రాత్రి కంటే ముందే చెల్లిస్తే జీఎస్టీ ఉండ‌దు.

ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తే

ఆన్ లైన్ లో ఏ షాపింగ్ చేసినా.. ఇవాళ అర్ధ‌రాత్రి వ‌ర‌కు బుక్ చేసుకున్న వాటికి మాత్ర‌మే జీఎస్టీ నుంచి మిన‌హాయింపు ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News