పవన్ ని ఎవరైనా గ్యాంగ్ రేప్ చేశారా

Update: 2022-10-19 00:34 GMT
విశాఖ ఎయిర్ పోర్టులో జరిగింది వేరని, కానీ ఏదో జరిగినట్లుగా ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తునాయని మంత్రి గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు. విశాఖ ఎయిర్ పోర్టులో మా మంత్రుల మీద దాడి చేశారు. వారి సహాయకులను గాయపరచారు. తీరా పరామర్శలేమో పవన్ కళ్యాణ్ కి ఇదేమి విడ్డూరమని ఆయన ప్రశ్నించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు అయినా ఇది అర్ధమవుతోందా లేదా అని నిలదీశారు.

ఎక్కడైనా గాయపడ్డ వారికి బాధితులకు పరామర్శలు ఉంటాయని, పవన్ కి ఏమైందని పరమర్శిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పవన్ ని ఎవరైనా గ్యాంగ్  రేప్ చేశారా హత్యా యత్నం చేశారా ఎందుకీ లేని పోని సానుభూతిని బాబు చూపిస్తున్నారని గుడివాడ నిగ్గదీశారు. నిజానికి విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమం ఆయనే పోస్ట్ పోన్ చేసుకున్నారు తప్ప ఎవరూ ఆపలేదని ఆయన చెప్పారు. అలాగే అనుమతి లేకుండా ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీ తీశారని, అందుకే పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని మంత్రి వివరించారు.

పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీస్ లో  అసభ్య పదజాలంతో దూషించడం పట్ల గుడివాడ ఆగ్రహించారు. చెప్పుతో కొట్టడం అంటే ప్రజాస్వామ్యంలో  అర్ధమేంటో తెలుసా. గాజువాక, భీమవరం లలో ఓడించడం, అలా రెండు చోట్ల ఓడిన పవన్ కి ఇప్పటికే జనాలు చెప్పుతో కొట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చెప్పుతో కొట్టడాలూ ఉండవని గెలుపు  ఓటములు మాత్రమేనా ఉంటాయని  ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే అని తాము ఇన్నాళ్ళూ చెబుతున్నది ఇపుడు నిజమైందని గుడివాడ అన్నారు. ఇన్నాళ్ళూ తెర చాటుగా ఇల్లీగల్ గా సాగిన బంధం ఇపుడు లీగల్ అయిందని, అందువల్ల మీరు ఎక్కడ తిరిగినా మరెన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదని గుడివాడ అన్నారు. అయితే జనాలను మాత్రం మభ్యపెట్టవద్దని సూచించారు.

రాజకీయాల్లో అనూహ్య మార్పులు అని పవన్ బాబుతో పొత్తులనే అనుకున్నామని ఆ మాట అని మరీ గంట కూడా కాకుండానే ఆయనతో భేటీ అయి పవన్ తన ఆరాటాన్ని అలా చూపించుకున్నారని ఎద్దేవా చేశారు. కాపులు పెద్ద సంఖ్యలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారని, అందులో అయిదుగురు మంత్రులుగా  ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో కాపుల మద్దతు తమ పార్టీకే ఉందని ఆయన అన్నారు.

తనకు కులం లేదంటూ మళ్లీ కులాల గురించే పవన్ చెబుతారని, కులం మాట పక్కన పెడితే ఆయన తెలుగుదేశానికి అనుకూలమని విమర్శించారు. కాపుల ఓట్లన్ గంపగుత్తగా టీడీపీ పరం చేయాలన్న పవన్ ఆలోచనలను ఎవరూ నమ్మరని కూడా గుడివాడ అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబే కాదు మొత్తం అంతా కలసి వచ్చిన 2024 ఎన్నికల్లో విజయం వైసీపీదే అని ఆయన అన్నారు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో చెలిమి చేస్తూ కాపులను ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్ముతారని పవన్ని నిలదీశారు. మొత్తానికి గుడివాడ పవన్ మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News