మూడు రాజధానులపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానులకు ప్రజలందరి మద్దతు ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇప్పటికే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేశారని మంత్రి అమర్‌నాథ్ గుర్తు చేశారు.
విశాఖపట్నంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్ మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పడం విశేషం.
లోకేష్ పాకుతూ పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పాదయాత్రపై పేటెంట్ ఒక్క వైఎస్సార్ కుటుంబానికే ఉంటుందని అమర్‌నాథ్ చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడానికి, అవినీతి ప్రభుత్వంపై సమర శంఖం పూరించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు పాదయాత్ర చేశారని మంత్రి అమర్‌నాథ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉందని నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
లోకేష్ 4 వేల కిలోమీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు పాక్కుంటూ పాదయాత్ర చేసినా టీడీపీని అధికారంలోకి తీసుకురాలేరని అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల తర్వాత కూడా ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి తలెత్తుకు తిరుగుతున్నారన్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు.