ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అయిదు నెలలు ఇట్టే గడచిపోయాయి. తానేంటో తన పని ఏమిటో అన్నట్లుగా ఉంటూ వచ్చారు. ఇక శాఖాపరంగా చూస్తే ఆయనకు పంచాయతీ రాజ్ శాఖ లభించింది. అలాగే హోదా పరంగా ఉప ముఖ్యమంత్రి పదవిని బూడి ముత్యాలనాయుడుకు ఇచ్చారు. ఇపుడు లేటెస్ట్ గా సచివాలయాలు రూరల్ జిల్లాలలో చూసే బాధ్యతలను కూడా కట్టబెట్టారు.
ఈ నేపధ్యంలో ఆయన మరింత దూకుడు పెంచాల్సి వస్తోంది. ఇక ఈ మధ్యనే నోరు మెదపని మంత్రులుగా శాఖాపరంగా వీక్ ఉన్న ఉన్నారంటూ వైసీపీ హై కమాండ్ కి కొన్ని పేర్లు నివేదికగా వెళ్లాయని ప్రచారం సాగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో విపక్షాన్ని బలంగా ఎదుర్కొంటున్నది గుడివాడ అమరనాధ్ మాత్రమే అని నివేదికలో పేర్కొన్నారుట.
దాంతో మంత్రులు అంతా యాక్టివ్ గా ఉండాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయని, మంత్రి వర్గ సమావేశంలో ఇదే విషయం మీద చర్చ సాగిందని కూడా చెప్పుకున్నారు. మొత్తానికి ఏమైందో ఏమో కానీ బూడి ముత్యాలనాయుడులో చురుకు పుట్టింది. ఆయన కూడా మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక తన జిల్లాలో అసలైన ప్రత్యర్ధిగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఆయన ఎంచుకున్నారు.
ఇప్పటిదాకా అయ్యన్న విమర్శలు చేస్తే గట్టిగా టార్గెట్ చేసేవారు ఎవరూ వైసీపీలో లేరు. అపుడపుడు గుడివాడనే కౌంటర్ చేసేవారు. అయితే అయ్యన్న నియోజకవర్గానికి పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం ఈ విషయంలో మౌనం వహించడమే చర్చగా ఉంటూ వచ్చేది. నిజానికి జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వెనక అయ్యన్న దూకుడుని కట్టడి చేయాలన్న టార్గెట్ ఉంది అంటారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో అది సులువు అవుతుంది అని కూడా హై కమాండ్ లెక్కలు వేసి మరీ బూడిని ముందు పెట్టింది.
ఇన్నాళ్ళకు బూడి తన టార్గెట్ ఏంటో తెలుసుకున్నారని అంటున్నారు. దాంతో ఆయన అయ్యన్నపాత్రుడు మీద హీటెక్కించే కామెంట్స్ చేశారు. అయ్యన్న ఎలా ఓడారో చంద్రబాబు కూడా కుప్పంలో వచ్చే ఎన్నికల్లో ఓడతారు అని కూడా విమర్శించారు. ఇక అయ్యన్న తనతో డిబేట్ కి రావాలని ఎవరి పాలన మేలు అయిందో జనం ముందే తేల్చుకుందామని మంత్రి గారు సవాల్ కూడా చేశారు.
అంతటితో ఆగకుండా ఫస్ట్ టైమ్ నర్శీపట్నం వెళ్ళి అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే ఉమా శంకర్ క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని మొత్తం స్థానిక రాజకీయాన్ని సమీక్షించారు. దీన్ని బట్టి చూస్తే బూడి ఇక మీదట ఇదే దూకుడుతో అయ్యన్నను టార్గెట్ చేసి పొలిటికల్ గా బ్రేకులు వేస్తారా అన్న చర్చ అయితే నడుస్తోంది. బూడిలో చురుకుదనం పుట్టడంతో రూరల్ జిల్లాలో వైసీపీకి ఎంతవరకూ లాభమన్న చర్చ కూడా సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.