ఏపీ మంత్రుల లెక్కే వేరుగా ఉంటుంది. కవర్ చేసేందుకు వారు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రానప్పుడు గమ్మున ఉంటే సరిపోయేదానికి.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం.. తమ పేలవమైన వాదనను వినిపించి.. అడ్డంగా బుక్ కావటం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఐటీ మంత్రిగా వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుడివాడ అమర్నాథ్ మరోసారి తన పేలవమైన వాదనను వినిపించి మరోసారి తిట్టు తినటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లటం.. వరుస పెట్టి ఒప్పందాలు చేసుకుంటున్న వేళ.. ఏపీ నుంచి ఎవరూ వెళ్లకపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ విపక్షం చేస్తున్న విమర్శలు.. ఆరోపణలు జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో.. టీడీపీ చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చిన అమర్నాథ్.. అడ్డంగా బుక్ అయ్యారు.
టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వానికి దావోస్ నుంచి ఆహ్వానం అందలేదన్న వాదన సరికాదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. గత ఏడాది నవంబరు 25న సీఎంకు.. ప్రభుత్వానికి ఆహ్వానాలు వచ్చినట్లుగా పత్రాల్ని చూపించారు. అయితే.. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని.. అందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతోనే దావోస్ వెళ్లలేదని మంత్రి పేర్కొనటం గమనార్హం.
మార్చిలో సదస్సు నిర్వహించాలంటే దానికి సంబంధించి పనులు చేయటానికి ఐటీ మంత్రిత్వ శాఖకు సంబందించిన సిబ్బంది.. అధికారులు ఉంటారు కదా? అలాంటిది మంత్రి తనకు తానుగా పనులేమీ చేయరు కదా? అలాంటప్పుడు.. దావోస్ ఎందుకు వెళ్లనట్లు? అయినా.. దావోస్ ట్రిప్ మహా అయితే వారం రోజులు.
లేదంటే పది రోజులు. నిజానికి మార్చిలో అంత పెద్ద సదస్సు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు.. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళితే.. మరింత మందితో భేటీకి అవకాశం ఉంటుంది.
మార్చిలో జరిగే సదస్సుకు ముందుస్తుగా వారితో ఒప్పందాలు చేసుకోవటంతో పాటు.. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసి.. విశాఖలోజరిగే కాన్ఫరెన్స్ సమయానికి మరింత బాగా ప్రిపేర్ అయ్యే వీలుంది కదా? అది వదిలేసి.. అందుకు భిన్నంగా సదస్సు ఏర్పాట్ల కోసం దావోస్ వెళ్లలేదన్న పేలవమైన వాదన మంత్రి గుడివాడను వేలెత్తి చూపేలా చేసిందంటున్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించేందుకు రెట్టించిన ఉత్సాహాన్ని ప్రదర్శించే గుడివాడ అమర్నాథ్.. తన సొంత శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.