ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆటో రిక్షాలు - ట్యాక్సీ - మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తానని ఇచ్చిన ఎన్నికల హామిని నేరవేర్చే దిశగా ముందడుగు పడింది. వీరికి చేసే ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. సెప్టెంబర్ 10 నుంచి ఆర్టీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలోని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు - ప్రాంతీయ రవాణా అధికారులు - మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్లు హెల్ప్ డెస్క్ లను కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.
అర్హులైన డ్రైవర్లు తమ వాహనం - లైసెన్సుతో ఆధార్ ను లింక్ చేసుకొని - రవాణా శాఖ వెబ్ సైట్ డేటాబేస్ తన పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్ ఎన్ కంబర్డ్) ఖాతా తెరవాలి. ఖాతాను తెరిచే లబ్ధిదారుడికి గ్రామ / వార్డు వలంటీర్ సాయపడతాడు. ఒక వ్యక్తికి - ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తాయని - దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం /మున్సిపాలిటీలు / నగర కార్పొరేషన్లకు వెళతాయట. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ - గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.
కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్ ఎంఎస్ డేటాబేస్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు - సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు. కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పరిశీలన కోసం రవాణా - ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రూ. పది వేల సాయానికి అర్హతలివే..
- ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్ సొంతదై ఉండి - సొంతగా నడుపుకోవాలి.
- ఆటో రిక్షా/లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
- సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ - పన్నుల రశీదులు) సరిగా ఉండాలి.
- అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన / తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి.