మన దగ్గర రెండో పెళ్లి, మూడో పెళ్లి అంటేనే.. ముక్కున వేలేసుకుంటారు. చెవులు కొరికేసుకుంటారు. కానీ.. కొందరు మాత్రం అదేదో సినిమా డైలాగ్ మాదిరిగా పదుల మందిని చేసుకుంటున్నారు. పదీ పదీ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు పురుషుల్లో గరిష్టంగా 38 మందిని పెళ్లిచేసుకున్నాడు మన దేశంలోని మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోచానా.
ఇదే విధంగా.. అత్యధిక మంది భర్తలను చేసుకున్న మహిళ కూడా ఉంది! ఆమె పేరు లిండాలో టేలర్ వుల్ఫ్. ఈమె ప్రపంచంలోనే అత్యధిక మందిని పెళ్లి చేసుకున్నది. ఇప్పటి వరకు 23 మందిని లీగల్ గా పెళ్లి చేసుకుంది. ఏ భర్త వద్దా కాంప్రమైజ్ కాలేకపోయిన ఈమె.. ఒకరి తర్వాత మరొకరు అనుకుంటూ ఇంత మందిని భర్తలుగా ఎంచుకుంది.
ఈ ఫీట్ సాధించిన మహిళ ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎవ్వరూ లేకపోవడంతో.. ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. ప్రస్తుతం ఈమె వయసు 68 సంవత్సరాలు. అమెరికాలోని ఇండియానా అనే రాష్ట్రంలో నివసిస్తోంది. ఈమె చివరి వివాహం 1996లో జరిగింది. గ్లిన్ స్కాటీ వుల్ఫ్ అనే వ్యక్తి ఈమె చివరి భర్త.
మరి, ఈమెకు తొలి వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1957లో ఈమె మొదటి సారి పెళ్లి చేసుకుంది. అప్పుడు లిండా వయసు 16 సంవత్సరాలు. ఆమె మొదటి భర్త పేరు జార్జ్ స్కాట్. వీరి వైవాహిక జీవితం 7 ఏళ్లు సాగింది. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు. అలా మొదలైన లిండా పెళ్లి ప్రస్థానం 23 మందితో ఆగింది. మొదటి భర్తతో గడిపిన ఏడు సంవత్సరాలే ఈమె వైవాహిక జీవితంలో అత్యధిక కాలం కావడం విశేషం. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదేనేమో!