లింగ మార్పిడి. ఒకప్పటి సమాజంలో ఇదో పెద్ద వింత! కానీ, మారుతున్న కాలంలో మారుతున్న ఆలోచనల కారణంగా.. లింగ మార్పిడి ఇప్పుడు సహజ ప్రక్రియగా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, దేశంలో లింగ మార్పిడి ఆపరేషన్లకు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కేంద్రంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. కారణాలు ఏవైనా.. ఇప్పుడు పురుషులు.. మహిళలుగా మారుతున్నారు. దశాబ్దం కిందటి వరకు కూడా లింగ మార్పిడి ఆపరేషన్లు అంటే.. దేశంలో వింతగా చర్చించుకునేవారు.. ఇలా లింగ మార్పిడి చేయించుకున్నవారిని చిన్నచూపు చూసేవారు. అయితే.. ఇటీవల కాలంలో ఇవన్నీ సహజ ప్రక్రియగా మారిపోయాయనే వాదన ఉంది.
రెండేళ్లలో 1000 ఆపరేషన్లు!!
ప్రస్తుతం దేశంలో గుజరాత్ రాష్ట్రంలో లింగ మార్పిడి ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇప్పటి వరకు 1000 ఆపరేషన్లు జరిగాయని ఆపరేషన్లు చేసిన వైద్యులే చెబుతుండడం గమనార్హం. ఇలా లింగ మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు కూడా సమాజంలో ధైర్యంగా వ్యవహరిస్తున్నారు. తమ అభిమతానికి అనుగుణంగానే తాము లింగ మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం 20 మంది సర్జరీలకు సంబంధించిన వివిధ దశలలో ఉండడం గమనార్హం. జండర్ ఛేంజ్ చేయించుకుంటున్న వీరంతా ధైర్యంగా తమ పరిస్థితిని ఆయా ప్రాంతాల్లో వారికి తెలియజేస్తున్నారు. కొత్త గుర్తింపును కోరుకుంటూ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.
రోజుకు 50-60 మంది క్యూ కడుతున్నారే!
గత రెండేళ్లలో అంటే 2020-21లోఅహ్మదాబాద్‌లో 1000కి పైగా సర్జరీలు జరిగాయని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్ష్ అమీన్ తెలిపారు. తాను 14 మంది పురుషులకు సర్జరీలు చేశానని.. సర్జరీ చేయించుకుంటామని తన దగ్గరకు ప్రతీ రోజూ 50 నుంచి 60 మంది వస్తుంటారని తెలిపారు. అంతేకాదు.. తనలాంటి సర్జన్లు అహ్మదాబాద్ లో 80 మందికిపైగా ఉన్నారని చెప్పడం విశేషం. ఇక, లింగ మార్పిడి ఆపరేషన్లకు మన దేశంలో అయితే.. సుమారు రూ.8 లక్షల వరకూ ఖర్చవుతోంది. అదే విదేశాల్లో అయితే.. భారీగానే ఖర్చవుతోంది. అయినప్పటికీ.. కొంతమంది వారి వారి ఆర్థిక స్థాయిలను బట్టి విదేశాలకు వెళ్లి మరీ సర్జరీలు చేయించుకుంటా రు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ లోని సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ లగవంకర్ తెలిపారు.
ఇదో చిత్రమైన కేసు!!
గుజరాత్ లోని అహ్మదాబాద్ కే చెందిన డాక్టర్ జెస్నూర్ డయారా(25 ఏళ్లు)ది చిత్రమైన కేసు. రష్యాకు చెందిన వైద్య యూనివ ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వాస్తవానికి ఈయన పురుషుడు. అయితే.. ఏమైందో ఏమో.. లింగ మార్పిడి చేయించుకో వాలని ఆలోచించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. డయారా మరో భిన్నమైన ఆలోచన చేశారు. పురుషుడిగా ఉన్న సమయంలో తన వీర్యాన్ని సేకరించి.. భద్రపరిచారు. అనంతరం.. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని.. గుజరాత్ రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారు. అంతేకాదు.. ఇప్పుడు మహిళగా మారిన డయారా.. గతంలో తాను సేకరించిన భద్రపరుచుకున్న తన వీర్యాన్ని వినియోగించి.. తనే ఒక బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటున్నారు. డయారా కలలు కనుక సాకారం అయితే.. తనకు పుట్టే బిడ్డకు.. తల్లి, తండ్రి కూడా డయారానే కావడం అత్యంత సంచలన విషయం కానుంది.