అంతా ఎన్నికల మాయ.. ఎన్నికలు దగ్గరలోనే ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పాలిట కనికరించింది. వారిపై ప్రేమను కురిపించింది. ఈ ప్రేమతో ఓట్లు సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తోంది. పండుగలు, పబ్బాలు వచ్చాయంటే చాలు ఇంట్లో సామాను నుంచి వేడుకల కోసం ఖచ్చితంగా అందరూ బయటకు వెళ్లాల్సిందే. దీపావళి పండుగకు ఇంకా చాలా సందడి ఉంటుంది. అందుకే దీపావళి సందర్భంగా వారం పాటు ట్రాఫిక్ కిక్కిరిసి పోతుంది. అందుకే వాహనదారులకు ఊరట లభించేలా తాజాగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
దీపావళి సందర్భంగా అక్కడ వారం పాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎలాంటి ఫైన్ విధించబోమని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఎన్నికలు జరుగబోతుండడంతో ప్రయాణికులకు ఈ మాత్రం వెసులుబాటు కల్పించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ మధ్య ఈ నిర్ణయం అమలులో ఉంటుందని హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవీ ప్రకటించారు.
దీపావళి సందర్భంగా గుజరాత్ ప్రజలకు ఈ శుభవార్త చెబుతున్నట్టు తెలిపింది. ఏదైనా రాయితీలో..డబ్బులో.. లేక పథకం కింద లబ్ది చేకూరుస్తారని అందరూ అనుకుంటుంటే.. ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశాం పండుగ చేసుకోండని బీజేపీ ప్రభుత్వం చావుకబురు చల్లాగా చెబుతోంది.
అయితే ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారని ఎవరైనా రూల్స్ ను అతిక్రమించాలని చూస్తే మాత్రం పోలీసులు ఊరుకోరు. నిబంధనలు అతిక్రమిస్తే గుజరాత్ పోలీసులు వెంటనే వారికి పూలు ఇచ్చి మరీ శిక్షిస్తారట.. అంతేకాదు.. దీపావళి సందర్భంగా భూపేంద్ర పటేల్ ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించబోతోందని తెలిపారు.
గుజరాత్లో ఈ ఏడాది డిసెంబర్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. అందుకే ప్రజలపై ఆవాజ్య ప్రేమ చూపిస్తూ వారిని ఆకర్షించే ఎత్తుగడను బీజేపీ చేస్తోంది. దీనిపై నెటిజన్లు బీజేపీపై సెటైర్లు, మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఓట్ల కోసమే ఈ ఎత్తుగడులు అంటూ దెప్పి పొడుస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.