గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో పట్టణంలో మచ్చా నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి ఇప్పటివరకు 142 మంది కన్నుమూసిన సంగతి తెలిసిందే. 140 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై బ్రిటిష్ వాళ్లు ఈ వంతెనను నిర్మించారు. పర్యాటక ఆకర్షణగా నిర్మించిన ఈ వేలాడే వంతెనను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఘటన జరిగిన రోజు ఆదివారం కావడంతో భారీ ఎత్తున పర్యాటకులు విహారానికి తరలివచ్చారు.
కాగా 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేశారని చెబుతున్నారు. దాదాపు రూ.2 కోట్లతో ఏడు నెలలపాటు పనులు నిర్వహించారని తెలుస్తోంది. ఆ సమయంలో పర్యాటకులను నిషేధించారు. మరమ్మతులు పూర్తయ్యాక కొద్ది రోజుల క్రితమే పర్యాటకులను ఈ వేలాడే వంతెనపైకి అనుమతించారు.
దీనిపై కొద్ది రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీలోనూ వాదోపవాదాలు జరిగాయి. వంతెన పటిష్టంగా ఉందో, లేదో తెలుసుకోకుండా పర్యాటకులను అనుమతిస్తే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని పలువురు సభ్యులు హెచ్చరించారు. అయితే భయపడాల్సిందేమీ లేదని అంతా బానే ఉందని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చింది.
అక్టోబర్ 26న గుజరాత్ కొత్త సంవత్సరం కావడంతో ఆ వంతెనను తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం భారీ ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే అని చెబుతున్నారు. మొత్తం 400 మందికి పైగానే సందర్శకులు రాగా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు వేలాడే వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలింది. దీంతో వంతెన రెండుగా చీలిపోయింది.
సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఈ వంతెనపై చేరడమే ఘటనకు కారణమని చెబుతున్నారు. కాగా మరమ్మతుల తర్వాత వంతెనకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేని మున్సిపల్ అధికారులు తెలిపారు.
వంతెన పున: ప్రారంభమైన నాలుగు రోజులకే ఘోర విషాదం జరగడం అందరినీ నివ్వెరపరిచింది. 140 ఏళ్ల క్రితం ఈ వేలాడే వంతెనను 1879లో అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని పనులను ప్రారంభించారు. 1880లో వంతెన నిర్మాణం పూర్తయింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి.
కాగా ఈ వేలాడే వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు), వంతెన వెడల్పు 1.25 మీటర్లు. కాగా ఈ వేలాడే వంతెన మోర్బీ పట్టణంలోని దర్బార్‌గఢ్, నజార్‌బాగ్ ప్రాంతాలను కలుపుతుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలోనూ చేర్చారు.
కాగా 1979లో మోర్బీ పట్టణంలోనే మచ్చూ నదిపై నిర్మించిన డ్యామ్ తెగిపోయింది. దీంతో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. ఈ విపత్తులో 2000 మందికిపైగా మరణించారు.
కాగా బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మితమైన మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జ్ (వేలాడే వంతెన).. గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని గుజరాత్ టూరిజం వెబ్‌సైట్‌లోనూ పేర్కొన్నారు. మచ్చు నది మీద నిర్మించిన ఈ వంతెన ఒక 'కళాత్మక, సాంకేతిక అద్భుతం' అని జిల్లా కలెక్టరేట్ వెబ్‌సైట్‌లో పేర్కొనడం గమనార్హం.
ఈ వేలాడే వంతెన, నదీ ముఖనగరం.. 'విక్టోరియా కాలం నాటి లండన్' నగరాన్ని జ్ఞప్తికి తెస్తాయని గుజరాత్ టూరిజం వెబ్‌సైట్ పేర్కొంటోంది. స్థానికంగా ఈ వంతెనను ప్రజలు 'జుల్తో పూల్' అని పిలుస్తుంటారు.
అయితే..వందేళ్లకు పైగా పురాతనమైన ఈ వేలాడే వంతెన శిథిలావస్థకు చేరటంతో ఈ ఏడాది మార్చిలో దీన్ని మూసివేశారు. రూ.2 కోట్లతో మరమ్మతులు చేశాక ఏడు నెలల విరామం అనంతరం ఈ వంతెనను అక్టోబర్ 26వ తేదీన తిరిగి తెరిచారు. కానీ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే ఆదివారం సాయంత్రం వంతెన కుప్పకూలింది.
అయితే మరమ్మతులు పూర్తయ్యాక అంతా బాగానే ఉందని స్థానిక మునిసిపాలిటీ ఇంకా ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ అందకపోవడం గమనార్హం. అయినా సరే అధికారులు సందర్శకులను మాత్రం బ్రిడ్జిపైకి అనుమతించారు. అంతేకాకుండా పరిమితికి మించి ప్రజలను దానిపైకి వెళ్లడానికి అనుమతించారు.
కాగా మునిసిపల్ ఆస్తి అయిన ఈ వంతెనను 15 ఏళ్ల పాటు మరమ్మతులు, నిర్వహణ కోసం కొన్ని నెలల కిందట ఒరేవా గ్రూప్‌కు అప్పగించారు. కానీ ఆ సంస్థ తమకు తెలియకుండా సందర్శకులకు అనుమతిచ్చిందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఈ వంతెన భద్రతను తాము తనిఖీ చేయలేకపోయామని అంటున్నారు.
ఈ వంతెన ఎలా కూలిపోయిందో తమకు తెలియదని.. వంతెన సామర్థ్యం, ఏం మెటీరియల్ వాడారు ఇవన్నీ ప్రైవేటు కంపెనీనే చూసుకుందని మునిసిపల్ అధికారులు తప్పించుకుంటున్నారు. వంతెన మీదకు సామర్థ్యం కన్నా ఎక్కువ మందిని అనుమతించారన్న అంశంపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.